శనివారం, 24 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సిఎంఆర్‌ఎల్‌ కేసులో కేరళ హైకోర్టు ఉత్తర్వులను కొట్టివేసిన సుప్రీం

2 రోజుల క్రితం

Supreme Court
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026, 02:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : సిఎంఆర్‌ఎల్‌-ఎక్సలాజిక్ కేసులో కేరళ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. ఈ కేసులో కేరళం మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, ఆయన కుమార్తె టి.వీణ, అల్లుడు, మాజీ మంత్రి రియాస్‌లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని కేరళ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాలను సవాలు చేసేందుకు కేరళ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ అనుమతి నిరాకరించింది. జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్‌ వి.మోహనలతో కూడిన ధర్మాసనం ఆ ఉత్తర్వులను నిలిపివేసింది. అలాగే మధ్యంతర ఉపశమనంగా ఎఫ్ఐఆర్ దర్యాప్తును ఏడు రోజుల పాటు నిలిపివేసింది.ఎఫ్‌ఐఆర్‌లోని అంశాల మెరిట్‌పై తాము ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాగే, పిటిషనర్లపై నమోదు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఇసిఐఆర్‌) చెల్లుబాటుపై కూడా ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదని తెలిపింది. అయితే, చట్టప్రకారం తగిన వేదికపై ఈ ఇసిఐఆర్‌ను సవాలు చేసుకునే స్వేచ్ఛను కల్పిస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది.


అవినీతి నిరోధక చట్టం, 1988 కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిందిగా కేరళ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఆదేశించారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించే ముందు, తాను ఈ విచారణలో భాగస్వామిని కాదని, అలాగే సింగిల్ జడ్జి తన వాదనలను వినలేదని విజయన్ వాదించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్