శనివారం, 19 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సురేందర్ కోలీ ఆత్మహత్య

12 గంటల క్రితం

koli
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 19, 2026, 01:59 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

హరిద్వార్‌ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2005-06 నిఠారీ వరుస హత్యల కేసులో నిర్దోషి అయిన సురేందర్‌ కోలీ మృతి చెందాడు. హరిద్వార్‌లో టీస్టాల్‌లో ఉరివేసుకున్నాడు. అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. 2006లో నొయిడాలోని నిఠారీ వద్ద మోనిందర్‌సింగ్‌ పంఢేర్‌ ఇంటి వెనుక మురుగుకాల్వలో 16 మంది చిన్నారుల అస్థికలు బయటపడటం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ కేసుల్లో దర్యాప్తు చేపట్టిన సిబిఐ పంఢేర్‌తోపాటు అతడి ఇంట్లో సహాయకుడైన కోలీని అరెస్టు చేసింది. ఈ వ్యవహారంలో, మొత్తం 19 కేసులను 2007లో సిబిఐ నమోదు చేసింది. తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో వాటిలో మూడింటిని మూసివేసింది. మిగతా కేసుల్లో కోలీని నిర్దోషిగా 2023 అక్టోబరు 16న అలహాబాద్‌ హైకోర్టు తేల్చింది. అయితే, దర్యాప్తులో సిబిఐ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, నిందితులే నేరం చేసినట్టు ప్రాసిక్యూషన్‌ రుజువు చేయలేకపోయిందని వ్యాఖ్యానించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో సిబిఐ, మృతుల తరఫు బంధువులు పిటిషన్లు వేయగా వాటన్నింటినీ, సుప్రీం కోర్టు గత ఏడాది జులైలో కొట్టివేసింది. ఈ నేపథ్యంలో, కొన్ని రోజుల క్రితం హరిద్వార్‌ వెళ్లిపోయిన కోలీ అక్కడే ఓ టీషాప్‌లో పనిచేస్తున్నాడు. కాగా, నిఠారి హత్యల కేసుకు సంబంధించి అతడు నిర్దోషిగా విడుదల కావడం అది అతడికి 13వ కేసు. అంతకుముందు, సంబంధితమైన మరో 12 కేసుల్లోనూ అతడు నిర్దోషిగా విడుదలయ్యాడు. మరోవైపు, ఈ కేసులో సహ నిందితుడైన పంఢేర్​ కూడా చాలా సంవత్సరాలు జైలులో ఉన్నాడు. కొంత కాలం తర్వాత 2023 అక్టోబర్ 20న విడుదలయ్యాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్