ముంబయి : ' మీరు కూడా పార్టీ మారండి.. అక్కడ వాషింగ్ మెషీన్ ఉంది ` అంటూ ... బాంబే హైకోర్టు జడ్డి చమత్కారించారు. పౌరులు ప్రభుత్వ బానిసలు కాదు.. ఏదైనా సమస్యపై నిరసనలకు దిగితే వారిపై బహిష్కరణకు దిగుతారా ? అని బొంబాయి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ వ్యక్తి అయినా నిరసనలు, ఉద్యమాల్లో పాల్గొంటే ఆంక్షలకు దిగే అధికారం ప్రభుత్వాలకు లేదని శుక్రవారం హైకోర్టు ఓ కేసు విచారణ దిశలో ఘాటైన రూలింగ్ వెలువరించి స్పష్టం చేసింది. ముంబయిలో స్థానిక రాజకీయ నాయకుడు పయీద్ అహ్మద్ వహీద్ చౌదరికి ప్రభుత్వం నగర బహిష్కరణ విధించింది. నిరసనల్లో తాను కేంద్రానికి, హోం మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలకు దిగానని, దీనిని తీవ్రంగా పరిగణించి తనపై బహిష్కరణ విధించారని.. ఈ ఉత్తర్వులను కొట్టివేయాలంటూ ... వహీద్ చౌదరి ముంబయి హైకోర్టును ఆశ్రయించారు. కేవలం నినాదాలకు దిగితే వెలివేస్తారా ? ప్రజలు ప్రభుత్వాలకు జీ హుజుర్లు కొట్టే సేవకులు కాదు ... పల్లకిలు మోసే బోయీలు కాదని పేర్కొన్న ముంబై హైకోర్టు బహిష్కరణ ఆదేశాలను కొట్టివేసింది . పిటిషనర్ చౌదరి స్థానిక సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డిపిఐ) ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. పిటిషనర్ రాజకీయాల్లో ఉండటంతో తగు పార్టీలోకి ఫిరాయిస్తే తనపై ఉన్న కేసులు అన్ని ఎగిరిపోయేలా చూసుకోవచ్చు అని సింగిల్ జడ్జి మాధవ్ జాందార్ చమత్కరించారు. ''మీరు కూడా పార్టీ మారాలి. ఎలాగూ మహారాష్ట్ర అంతటా బేరసారాలు జరుగుతున్నాయి. మీపై కొన్ని ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నాయి. పార్టీ మారే విషయాన్ని పరిశీలించండి. అక్కడ ఒక వాషింగ్ మెషీన్ ఉంది `` అంటూ ... జడ్జి చమత్కరించారు. ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాలలో జోరుగా సాగుతున్న పార్టీల ఫిరాయింపుల విషయాన్ని పరోక్షంగా జడ్జి ప్రస్తావించారు. పవర్‌లో ఉన్న పార్టీ వైపు వెళ్లితే నేరాలు మాఫీ అవుతాయి కదా అని సరదాగా సూచించారు.
పార్టీ మారండి.. అక్కడ వాషింగ్ మెషీన్ ఉంది : బాంబే హైకోర్టు జడ్డి చమత్కారం
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 04, 2026, 11:09 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)