శుక్రవారం, 24 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆ ప్రచారం పూర్తిగా నిరాధారం : విమానయాన ప్రవేశంపై అదానీ క్లారిటీ

1 గంట క్రితం

That speculation is completely baseless: Adani clarifies stance on entering the aviation sector.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 24, 2026, 10:41 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : అదానీ గ్రూప్ విమానయాన వ్యాపారంలోకి అడుగుపెట్టనున్నట్లు వస్తున్న వార్తలను అదానీ ఎంటర్ ‌ప్రైజెస్‌ ఖండించింది. ఆ కథనాలు, మార్కెట్‌ ఊహాగానాలు నిరాధారమైనవని, అవాస్తమని అదానీ గ్రూప్‌ ప్రకటించింది. తాము ఆ రంగంలోకి ప్రవేశించే ప్రతిపాదననేమీ పరిశీలించడం లేదని స్పష్టం చేసింది. ముంబయి, న్యూఢిల్లీ వంటి అత్యధిక రద్దీ ఉండే విమానాశ్రయాలను నిర్వహిస్తున్న కంపెనీలు, షెడ్యూల్డ్‌ విమానయాన సంస్థలో 10 శాతానికి పైగా వాటా కలిగి ఉండకూడదనే నిబంధనను సవరించాలని ప్రభుత్వాన్ని ‘అదానీ గ్రూప్‌’ కోరిందని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. మరోవైపు ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమానికి మద్దతుగా భారత వైమానిక దళం (ఐఎఎఫ్) కోసం.. తదుపరి తరం ఏరియల్ ఎర్లీ వార్నింగ్ అండ్‌ కంట్రోల్ (AEW&C-MKII) వ్యవస్థను అభివృద్ధి చేయడానికి కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం అదానీ డిఫెన్స్ అండ్‌ ఏరోస్పేస్.. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఓ ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ నేపథ్యంలోనే అదానీ గ్రూప్‌ విమానయాన రంగంలోకి ప్రవేశించనున్నట్లు ఊహాగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో .... అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ అధికార ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు. ఎయిర్‌లైన్‌ ప్రారంభించనున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవని, వాస్తవ విరుద్ధమని స్పష్టం చేశారు. అదానీ ఎయిర్‌పోర్ట్స్‌ ఇటీవల రూ.20 వేల కోట్లకు పైగా పెట్టుబడితో ఐదు రాష్ట్రాల్లోని ఆరు విమానాశ్రయాల పరిధిలో సమీకృత ‘ఎయిర్‌పోర్ట్‌ సిటీ’ల అభివృద్ధి ప్రణాళికను ప్రకటించింది. అయితే, దీనికి ఎయిర్‌లైన్‌ సేవలు ప్రారంభించాలనే ఉద్దేశంతో ఎలాంటి సంబంధం లేదని సంస్థ స్పష్టం చేసింది.






ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్