బుధవారం, 28 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionటాటా గ్రూప్‌ను నాశ‌నం చేస్తున్నారు..

5 గంటల క్రితం

టాటా గ్రూప్‌ను నాశ‌నం చేస్తున్నారు..
- మోడీ, అమిత్ షాల‌పై రాహుల్‌గాంధీ విమర్శలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 28, 2026, 11:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • మోడీ, అమిత్ షాల‌పై రాహుల్‌గాంధీ విమర్శలు

​​న్యూఢిల్లీ : లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ టాటా గ్రూప్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. టాటా సంస్థను 'నేరపూరితంగా నాశనం' చేస్తున్నారని విమర్శించారు. సంస్థ‌ను నాశ‌నం చేస్తున్నా దేశంలోని వ్యాపారవేత్తలు భయంతో నోరు మెదపడంలేదని అన్నారు. ఈ మేరకు బుధవారం సోషల్‌ మీడియా ‘ఎక్స్’లో ఒక పోస్ట్ చేశారు. భారతీయ వ్యాపారరంగం మోడీ, అమిత్ షాల ఆటవస్తువు కాదని రాహుల్‌గాంధీ అన్నారు. ఇరువురి నేరాలవ‌ల్ల అన్యాయ‌మ‌వుతున్న వారికి న్యాయం జరిగేలా తాము చూస్తామ‌ని తన పోస్టులో పేర్కొన్నారు. టాటా గ్రూప్‌లో కొంతకాలంగా నడుస్తున్న అంతర్గత వివాదం నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ పునర్నియామకాన్ని టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయెల్ టాటా సవాల్‌ చేశారు. ​గతనెల 17న జరిగిన బోర్డు తీర్మానం చెల్లదని, నియామక ప్రక్రియలో నిబంధనలు పాటించలేదని ఆయన అక్టోబర్ 26న రాసిన లేఖలో ఆరోపించారు. ఈ వివాదం కార్పొరేట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్