శనివారం, 04 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆ 23 మంది ఉగ్రవాదులే : కేంద్ర హోం మంత్రిత్వ శాఖ

1 గంట క్రితం

ఆ 23 మంది ఉగ్రవాదులే : కేంద్ర హోం మంత్రిత్వ శాఖ
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 04, 2026, 12:49 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : దేశంలో పలు విధ్వంసక చర్యలకు పాల్పడుతున్న 23 మందిని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా ఉగ్రవాదులుగా ప్రకటించింది. యూఏపీఏ సెక్షన్ 35 కింద వీరిని అధికారికంగా ఉగ్రవాదుల జాబితాలో చేర్చినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. జమ్మూ కాశ్మీర్‌లో దాడులకు ప్రణాళికలు, డ్రోన్లతో ఆయుధాల సరఫరా, చొరబాట్లు, టెర్రర్ రిక్రూట్‌మెంట్‌ వంటి వాటిల్లో వారికి ప్రమేయం ఉందని పేర్కొంది. ఈ జాబితాలో చేరిన వారంతా జైషే మహ్మద్ (JeM), లష్కరే తోయిబా (LeT), జమాత్-ఉద్-దవా, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) వంటి నిషేధిత సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. వీరంతా సరిహద్దుల అవతల నుంచి పెద్ద ఎత్తున కార్యకలాపాలు సాగిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ ఉగ్రవాదులు ప్రధానంగా నిధుల సమీకరణ, కొత్తవారిని రిక్రూట్ చేయడం, వారికి ఆయుధ శిక్షణ ఇవ్వడం వంటి విద్రోహ చర్యలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. India MHA Declares 23 Individuals As Terrorists Under UAPA Striking Down Networks JeM LeT and TRF తాజా జాబితాలోని 23 మందిలో .... 17 మంది పాకిస్థాన్‌కు చెందిన పౌరులు కాగా, ఆరుగురు భారతీయ పౌరులు ఉన్నారు. వీరు పాకిస్థాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ తో పాటు పాకిస్థాన్‌లోని వివిధ ప్రాంతాల్లో తలదాచుకుంటూ భారత్‌పై కుట్రలు పన్నుతున్నారని, డ్రోన్‌ల ద్వారా సరిహద్దుల్లోకి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని చేరవేయడం, అలాగే జమ్ము కాశ్మీర్‌లో భద్రతా దళాల కదలికలపై నిఘా ఉంచి దాడులకు ప్లాన్ చేయడం వంటి పనులు చేస్తున్నారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉపా చట్టం ప్రకారం ... ఒక వ్యక్తికి ఉగ్రవాద కార్యకలపాల్లో ప్రమేయం ఉందని భావిస్తే, వారిని ఉగ్రవాదిగా ప్రకటించే అధికారం కేంద్రానికి ఉంది. దాంతో వారి లావాదేవీలను నిలిపివేయడానికి, ఆస్తులను జప్తు చేయడానికి జాతీయ దర్యాప్తు సంస్థకు వీలు కలుగుతుంది. 2019 లో చేసిన సవరణలతో వ్యక్తులను ఉగ్రవాదులుగా ప్రకటించడానికి అవకాశం ఏర్పడింది. అందుకు ముందు గ్రూప్‌లను మాత్రమే ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చేవారు. కాగా ఈ 23 మందితో కలిపి ప్రకటిత ఉగ్రవాదుల సంఖ్య 80కి చేరింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్