- నిర్థారించిన కేరళం కోర్టు
తిరువనంతపురం : 2016లో జరిగిన సిపిఎం నాయకులు సివి ధనరాజ్ దారుణ హత్య కేసులో ముగ్గురు బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలను కేరళ కోర్టు సోమవారం నిర్థారించింది. కన్నూర్ జిల్లాలోని తాలిపరంబ అదనపు సెషన్స్ జడ్జి కె.ఎన్. ప్రశాంత్ ఈ మేరకు తీర్పు ఇచ్చారు. టిపి బిజు (34), ఎం విపిన్ (34), ఎం. వైశాఖ్ (31)లను దోషులుగా నిర్ధారించారు. శిక్షను తరువాత ప్రకటిస్తామని తెలిపారు. దోషులుగా ప్రకటించిన ముగ్గురిలో విపిన్, వైశాఖ్ సోదరులు. ఈ ముగ్గురూ ధనరాజ్ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని కోర్టు స్పష్టంగా నిర్థారించింది. ఏజిమల సిపిఎం శాఖ కార్యదర్శి ధనరాజ్ 2016 జూలై 11న రామంతాలిలోని తన ఇంటికి తిరిగి వెళుతుండగా దారుణంగా హత్యకు గురయ్యారు. ప్రాసిక్యూషన్ ప్రకారం, దుండగులు మోటార్‌సైకిళ్లపై ధనరాజ్‌ను వెంబడించి అతని తల్లి, భార్య కళ్లెదుటే ఇంటి సమీపంలో కత్తిలతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో మొత్తం
ఇరవై మంది బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలను నిందితులుగా పేర్కొన్నప్పటికీ, ముగ్గుర్ని దోషులుగా నిర్థారించిన కోర్టు, మరో 16 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. నిందితులలో ఒకరైన సి బిజు విచారణ సమయంలోనే హత్యకు గురయ్యారు. ఈ కేసు విచారణ 2025 సెప్టెంబర్ 25న ప్రారంభమయింది. ఈ విచారణలో మొత్తం 43 మంది సాక్షులను, 177 పత్రాలను కోర్టు పరిశీలించింది.








కామెంట్‌లు (0)