శనివారం, 31 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తేనిజిల్లా జైలు ఘటనపై సిఎం విజయం ఆగ్రహం

4 గంటల క్రితం

CM Vijay
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 31, 2026, 11:28 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

చెన్నై : తమిళనాడులోని తేని జిల్లా సబ్‌జైలు నుండి ఖైదీలు పారిపోయిన ఘటనపై సిఎం విజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు తెక్కంపట్టి డిప్యూటీ జైలు సూపరింటెండెంట్‌ను సస్పెండ్‌ చేయాలని శనివారం ఆదేశించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు డిప్యూటీ జైలు సూపరింటెండెంట్‌ (ఇన్‌చార్జ్‌ )ఎన్‌.రామలింగంను తక్ష‍ణమే సస్పెండ్‌ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జైళ్లలో భారీగా బదిలీలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. భద్రతా లోపాలకు కారణమైన ఇతర అధికారులపై కఠినమైన క్రమశిక్ష‍ణా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈనెల 26న తేనిజిల్లా తెక్కంపట్టి జైలు నుండి సినీఫక్కీలో 17మంది ఖైదీలు పారిపోయిన సంగతి తెలిసిందే. అనంతరం ఖైదీలందిరినీ అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్