మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆవుల స్మగ్లర్లంటూ ముగ్గురిపై పోలీసులు కాల్పులు.. ఇద్దరు మృతి

15 నవంబర్, 2026

cattle smugglers
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026, 12:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

చండీగఢ్‌ : ఆవుల స్మగ్లర్లని ఆరోపిస్తూ ముగ్గురు ముస్లింలపై పోలీసులు ఎన్‌కౌంటర్‌ జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఆదివారం నుహ్‌లో ఈఘటన జరిగింది. వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారు జామున సాబీర్, గబ్బర్ అలియాస్ హడియా, తాహిర్ ఏడు ఆవులతో ఒక వాహనంలో వెళ్తుండగా పోలీసులు కాల్పులు జరిపారు. ఈకాల్పుల్లో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ సాబీర్‌, గబ్బర్‌ అలియాస్‌ హడియా మరణించగా, తాహిర్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. వారు పశువుల అక్రమరవాణా చేస్తున్నారని, పోలీసులపై కాల్పులు జరిపారని ఫిరోజ్‌పూర్ జిర్కా పోలీసులకు చెందిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (సిఐఎ) బృందానికి నాయకత్వంతో వహిస్తున్న సబ్-ఇన్‌స్పెక్టర్ మహేంద్ర సింగ్ తెలిపారు. ఈ ఆపరేషన్ సమయంలో, 315 బోర్ కలిగిన మూడు నాటు తుపాకులను, మూడు తూటాలను, ఐదు ఖాళీ తూటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని అన్నారు. మృతదేహాలను మార్చురీలో ఉంచి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని చెప్పారు. ఈ ఘటనపై మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించడమైనదని నుహ్‌ పోలీసు ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్