బుధవారం, 22 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

మ‌హిళా రిజ‌ర్వేష‌న్లను త‌క్ష‌ణ‌మే అమ‌ల్జేయాలి

18 గంటల క్రితం

aidwa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 22, 2026, 08:18 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- ​జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ఐద్వా ఆందోళ‌న

ప్ర‌జాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో : పార్లమెంట్ ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లోనే మహిళలకు పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలలో 33 శాతం రిజర్వేషన్‌ను తక్షణమే అమలు చేయాలని ఐద్వా అధ్య‌క్ష‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు పికె శ్రీమ‌తి టీచ‌ర్‌, క‌నినిక ఘోష్ డిమాండ్ చేశారు. మంగ‌ళ‌వారం నాడిక్క‌డ జంత‌ర్ మంత‌ర్‌లో 'నేషనల్ కోయిలిషన్ ఫర్ ఉమెన్స్ రిజర్వేషన్' ఆధ్వర్యంలో ఆందోళ‌న చేప‌ట్టారు. ఇతర మహిళా సంఘాల కార్యకర్తలు, వివిధ వర్గాలకు చెందిన వందలాది మంది మహిళలతో కలిసి ఐద్వా జాతీయ నాయ‌క‌త్వం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అన్ని రకాల షరతుల నుండి వేరు చేసి, ఎటువంటి జాప్యం లేకుండా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఐద్వా ఉపాధ్యక్షులు మరియం ధావలే, ఎస్. పుణ్యవతి, స‌హాయ కార్యదర్శి ఆశా శర్మతో పాటు ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్