ప్రారంభించిన సిఐటియు ప్రధానకార్యదర్శి ఎలమరం కరీమ్
తిరువనంతపురం : కార్మిక, కర్షక, ప్రజా సమస్యలపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిరంకుశ వైఖరిని నిరసిస్తూ ఈ ఏడాది డిసెంబరు 1, 2 తేదీల్లో చేపట్టనున్న ఢిల్లీ ముట్టడి (ఆక్యుపై ఢిల్లీ) ఉద్యమానికి సిఐటియు ముమ్మర ప్రచారం సాగిస్తోంది. పార్లమెంట్ మార్చ్‌కు మద్దతును సమీకరించేందుకు కేరళలో కొజికోడ్ జిల్లా కమిటీ నిర్వహించిన వాహన ప్రచార ర్యాలీని సిఐటియు ప్రధాన కార్యదర్శి ఎలమరం కరీమ్ ప్రారంభించారు. కార్మికుల పార్లమెంట్ మార్చ్ నేపథ్యంలో కేరళం వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో సిఐటియు వాహన ర్యాలీలను నిర్వహిస్తోంది. నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, అందరికీ కనీస వేతనం రూ.42వేలు ఇవ్వాలని, సార్వజనీన కనీస పెన్షన్ రూ.21వేలు చేయాలని, ప్రభుత్వ రంగంలోని ఖాళీలను భర్తీ చేయాలని, కాంట్రాక్ట్ వర్కర్లను క్రమబద్ధీకరించాలని, స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని, కార్మిక హక్కుల ఉల్లంఘనలకు స్వస్తి పలకాలని, యూనియన్లు, సమ్మెలను నేరాలుగా పరిగణించడాన్ని విరమించాలని, ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎను పునరుద్ధరించాలని, నీరు, భూమి, అడవులను, జాతీయ ఆస్తులను పరిరక్షించాలని, భూ ఆక్రమణనలకు స్వస్తి పలకాలని, నిర్వాసితులకు పునరావాసం, ఉపాధి కల్పించాలని తదితర డిమాండ్ల సాధన కోసం సిఐటియు పార్లమెంట్ మార్చ్‌కు పిలుపిచ్చిన సంగతి తెలిసిందే.







కామెంట్‌లు (0)