తిరువనంతపురం : ప్రసిద్ధ అధ్యాత్మిక క్షేత్రం శబరిమల అయ్యప్పస్వామి ఆలయం నూతన ప్రధాన అర్చకుడిగా అరీక్కర సుబ్రహ్మణ్యన్ శంకర నంబూద్రి ఎంపికయ్యారు. మరికొద్ది రోజుల్లో మండల- మకరవిలక్కు యాత్ర సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో తిరువాంకూర్ దేవస్వం బోర్డు అధికారుల నూతన ప్రధాన అర్చకుడిని ఎంపిక చేశారు. అలాగే, శబరిమల ఆలయానికి 100 మీటర్ల దూరంలో ఉన్న ప్రసిద్ధ మలికప్పురం దేవి ఆలయ నూతన ప్రధాన అర్చకుడిగా ఎ దామోదరన్ నంబూద్రి ఎంపికయ్యారు. ఈ ఇద్దరు ప్రధాన అర్చకులను డ్రా విధానంలో ఎంపిక చేశారు. పందళం రాజకుటుంబానికి చెందిన చిన్నారులతో డ్రా తీయించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సారి కూడా ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున పూజల అనంతరం డ్రా తీశారు. శబరిమల ప్రధాన అర్చక పదవి కోసం తుది పరిశీలన జాబితాలో మొత్తం ఏడుగురు అర్చకుల పేర్లు పోటీలో నిలిచాయి. వారిలో అరీక్కర సుబ్రహ్మణ్యన్ శంకర నంబూద్రి పేరు డ్రా విధానం ద్వారా ఎంపికైంది. కొత్తగా ఎంపికైన ఇద్దరు ప్రధాన అర్చకులు నవంబరు 16న బాధ్యతలు స్వీకరించనున్నారు.







కామెంట్లు (0)