- చెన్నైకి రెడ్ అలర్ట్
తమిళనాడు : తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. శనివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు చైన్నైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణ శాఖ చెన్నై, తిరుచిరాపల్లి, కోయంబత్తూరు, నీలగిరి జిల్లాలకు సోమవారం ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది. ఈ నాలుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలోని ఉత్తర, పశ్చిమ, మధ్య, దక్షిణ ప్రాంతాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండనుంది. ధర్మపురి, కృష్ణగిరి, సేలం, తిరువళ్లూరు, దిండిగల్, తేని, విరుదునగర్, తెన్కాశి, తిరునెల్వేలి, కన్యాకుమారి, తూత్తుకుడి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు ప్రకటించారు.








కామెంట్‌లు (0)