శుక్రవారం, 13 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రభుత్వ ఉద్యోగి 48గంటలు కస్టడీలో వుంటే సస్పెండ్‌ అయినట్లే !

3 రోజుల క్రితం

ప్రభుత్వ ఉద్యోగి 48గంటలు కస్టడీలో వుంటే  సస్పెండ్‌ అయినట్లే !
వేరే ఉత్తర్వులు అవసరం లేదు
సుప్రీం వ్యాఖ్యలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 09, 2026, 09:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- వేరే ఉత్తర్వులు అవసరం లేదు

- సుప్రీం వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : ప్రభుత్వ ఉద్యోగి అరెస్టయి, 48గంటల పాటు కస్టడీలో వున్నట్లైతే ఇక ఆ వ్యక్తి సస్పెన్షన్‌‌కు గురైనట్లేనని భావించాల్సి వుంటుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. వేరే సస్పెన్షన్‌ ఉత్తర్వులు అవసరం లేదని స్పష్టం చేసింది. ముడుపుల కేసులో నిందితుడైన బీహార్‌ ఆస్పత్రి మేనేజర్‌‌ను తిరిగి అదే ఆస్పత్రిలో, అదే పదవిలో నియమించడంపై జస్టిస్‌ జె.బి.పార్దివాలా, జస్టిస్‌ ‌మన్మోహన్‌‌లతో కూడిన సుప్రీం బెంచ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడికి సెషన్స్‌ ‌కోర్టు ఇచ్చిన రెగ్యులర్‌‌ బెయిల్‌‌ను రద్దు చేయాలని పాట్నా హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌‌పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ఇక్కడ మనం విస్మరించరాని ఒక్క అంశం వుంది. అరెస్టయిన తర్వాత నిందితుడు దాదాపు 15రోజులు జ్యుడీషియల్‌ ‌కస్టడీలో వున్నాడు. ఆ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి అయినందున 48గంటల పాటు కస్డడీలో వున్నందున ఇక ఆ వ్యక్తి సస్పెన్షన్‌ అయినట్లే అర్ధం. దానికి వేరే ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది.

బీహార్‌‌లోని సమస్తిపూర్‌‌లో సదర్‌ ఆస్పత్రిలో మేనేజర్‌/అడ్మినిస్ట్రేటర్‌‌గా పనిచేస్తున్న నిందితుడు, పెండింగ్‌‌లో వున్న వేతనం రూ.36,421 మొత్తాలను చెల్లించేందుకు రూ.4వేలు లంచం ఇవ్వాలంటూ ఫిర్యాదీదారుడిని డిమాండ్‌ ‌చేశాడు. సెషన్స్‌ ‌కోర్టు బెయిల్‌ ‌మంజూరు చేయడానికి ముందుగా దాదాపు 15 రోజుల పాటు జ్యుడీషియల్‌ ‌కస్టడీలో వున్నాడు. కాగా ఈ బెయిల్‌‌ను ఫిర్యాదీదారుడు పాట్నా హైకోర్టులో సవాలు చేశాడు. దాంతో ఆ బెయిల్‌‌ రద్దు అయింది. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ నిందితుడు సుప్రీంను ఆశ్రయించాడు. ఆ సందర్భంగా సుప్రీం పై వ్యాఖ్యలు చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్