సోమవారం, 23 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సైబర్‌ నేరగాళ్ళుంటారు జాగ్రత్త !

2 గంటల క్రితం

సైబర్‌ నేరగాళ్ళుంటారు జాగ్రత్త !
- వాట్సాప్‌ వెబ్‌ అడ్వైజరీ జారీ చేసిన కేంద్రం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026, 11:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- వాట్సాప్‌ వెబ్‌ అడ్వైజరీ జారీ చేసిన కేంద్రం

న్యూఢిల్లీ : సైబర్‌ ‌నేరగాళ్ళపై వాట్సప్‌ ‌వెబ్‌ ‌యూజర్లకు కేంద్ర హోం శాఖ హెచ్చరిక జారీ చేసింది. ‌కంప్యూటర్లలో వాట్సాప్‌ ‌వెబ్‌ ద్వారా ప్రభుత్వ, సంస్థాగత, ఆర్థిక, విశ్వసనీయ లేదా సున్నిత సమాచారాలను మార్పిడి చేసుకునేటపుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిందిగా సూచనలు జారీ చేసింది. అనధికారికంగా అకౌంట్లలోకి చొరబడే ప్రమాదం పొంచి వుందని వాట్సాప్‌ ‌వెబ్‌ ‌యూజర్లను హెచ్చరిస్తూ ఇండియన్‌ ‌సైబర్‌ ‌క్రైమ్‌ ‌కోఆర్డినేషన్‌ ‌సెంటర్‌ (14‌సి) కింద జాతీయ సైబర్‌ ‌నేరాల ముప్పు విశ్లేషణా విభాగం (ఎన్‌‌సిటిఎయు) ఈ మేరకు అడ్వైజరీ విడుదల చేసింది. ‌కేవలం బ్రౌజర్‌ ‌విండో లేదా టాబ్‌ మూసేసినంత మాత్రాన సరిపోదని, ప్రతి సెషన్‌ ముగిసిన వెంటనే మాన్యువల్‌‌గా లాగవుట్‌ ‌చేయాల్సిందిగా కోరింది. ముఖ్యంగా కార్యాలయాల్లో లేదా బహిరంగంగా గల కంప్యూటర్లు ఉపయోగించే సమయంలో ఈ సూచన తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. సైబర్‌ ‌నేరగాళ్ళు విశ్వసనీయమైన వాట్సాప్‌ ‌వెబ్‌ ‌సెషన్లను దుర్వినియోగం చేసి ప్రైవేట్‌ ‌సంభాషణల యాక్సెస్‌‌ను సంపాదిస్తారని, అకౌంట్‌ ‌హోల్డర్‌‌గా నటిస్తూ సందేశాలు పంపడం, కాంటాక్ట్‌ ‌జాబితాలను చూడడం, గ్రూపు చాట్‌‌లను పరిశీలించడం చేసే ప్రమాదం వుందని హెచ్చరించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్