ఫారం-6పై ఇసి నిర్ణయం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిన రాష్ట్రాల్లో కొత్తగా ఓటరు నమోదు కోసం సమర్పించే ఫారం-6 ఆన్‌లైన్ దరఖాస్తుల నుంచి ‘ఎస్ఐఆర్ డిక్లరేషన్’ను ఉపసంహరించుకుంది. మునుపటి ఎస్ఐఆర్ ప్రక్రియలోని తల్లిదండ్రులు, తాతల వివరాలను సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. దీంతో, తల్లిదండ్రుల పాత డేటాతో సంబంధం లేకుండా ఇకపై కొత్త ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం యువతకు లభించింది. ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతున్న ప్రాంతాల్లో మాత్రం కొత్తగా పేర్ల నమోదు కోసం యువ ఓటర్లు తమ తల్లిదండ్రులకు సంబంధించి మునుపటి ఎస్ఐఆర్ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. అయితే, అదనపు డిక్లరేషన్‌గా మాత్రమే యువ ఓటర్లు ఈ వివరాలను ఇవ్వాల్సి ఉంటుందని ఈసి పేర్కొంది. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటు కోల్పోయినవారూ ఇవే అదనపు వివరాలు సమర్పించాలి. అయితే ఫారం-6 లో ఎలాంటి మార్పులు చేయలేదని వివరించింది.








కామెంట్‌లు (0)