mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఎన్నికల అనంతర నేటి పరిస్థితి...

2 రోజుల క్రితం

cpm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 17, 2026, 06:45 పూర్వాహ్నం | 5 నిమిషాల చదవడం

ఇటీవల జరిగిన సిపిఎం కేంద్ర కమిటీ సమావేశంలో, జాతీయ పరిణామాలకు సంబంధించి కొన్ని ప్రధాన ధోరణులను పార్టీ ఈ విధంగా గుర్తించింది: ”అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాజకీయ వ్యవస్థపై ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి పట్టును మరింత బలపరిచాయి. బెంగాల్‌లో బిజెపి విజయం వామపక్ష, ప్రగతిశీల, లౌకిక శక్తులకు ఒక పెద్ద దెబ్బ. అలాగే ఎన్నికల సంఘం వంటి వ్యవస్థలు బహిరంగంగానే ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండాను ముందుకు తీసుకెళ్తూ, ఎన్నికల ప్రక్రియ పవిత్రతను దెబ్బ తీస్తున్నాయి.” పశ్చిమ బెంగాల్‌, అస్సాం ఫలితాలు ”బిజెపి నేతృత్వంలోని మితవాద, మతతత్వ శక్తుల ఆధిపత్యాన్ని సూచిస్తున్నాయని, ఇది లౌకిక, ప్రగతిశీల, ప్రజాతంత్ర శక్తులన్నిటికీ తీవ్ర ఆందోళన కలిగించే అంశమని” మేము నొక్కి చెప్పాం.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ‘ఇండియా’ బ్లాక్‌ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ 24వ అఖిల భారత మహాసభ రాజకీయ సమీక్షా నివేదికలో, బిజెపి ని ఒంటరిపాటు చేసి ఓడించాలన్న మా వ్యూహం సరైనదేనని తేలింది. లౌకిక శక్తులన్నిటినీ విస్తృతంగా సమీకరించేందుకు మేము కృషి చేశాం. లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించిన విధానం వల్ల ‘ఇండియా’ బ్లాక్‌ ఏర్పాటు, రాష్ట్ర స్థాయి సీట్ల పంపకం, ప్రత్యేక ఎన్నికల ప్రణాళికలు వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ బ్లాక్‌కు శాశ్వత సంస్థాగత నిర్మాణం లేనప్పటికీ, మేము అనుసరించిన ఈ విధానాలన్నీ సరైనవని రుజువయ్యాయి. పాక్షికమే అయినప్పటికీ, సాధించిన ఈ ఎన్నికల ఐక్యత బిజెపి కి ఎదురుదెబ్బ తగిలేలా చేసింది. ఫలితంగా బిజెపి లోక్‌సభలో తన మెజారిటీని కోల్పోయి, 63 సీట్లు నష్టపోయి కేవలం 240 సీట్లకే పరిమితమైంది. ‘ఇండియా’ బ్లాక్‌ లోని పార్టీలు మొత్తం 234 సీట్లు సాధించడంతో ప్రతిపక్షం గణనీయంగా బలపడింది.
అదే సమయంలో, ‘ఇండియా’ బ్లాక్‌లో భాగస్వామిగా ఉంటూనే, ఆ బ్లాక్‌తో వ్యవహరించే విషయంలో మేము చాలా జాగ్రత్తగా ఉన్నాము. ఆ సమీక్షా నివేదికలో ఇలా పేర్కొన్నాం. ”’ఇండియా’ బ్లాక్‌ లోని పార్టీల అనుభవం ఆధారంగా, మనం మన విధానాన్ని, వ్యూహాలను జాగ్రత్తగా రూపొందించుకోవాలి… పార్టీ స్వతంత్ర పాత్రను, కార్యకలాపాలను ‘ఇండియా’ బ్లాక్‌ కార్యకలాపాలతో భర్తీ చేసే ధోరణిని మనం అడ్డుకోవాలి. అలాగే, ‘ఇండియా’ బ్లాక్‌లోని ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్‌ వర్గ స్వభావం పట్ల కూడా మనకు స్పష్టత ఉండాలి. కాంగ్రెస్‌ తన జాతీయ ఆర్థిక విధానాలలో సమర్థించే లేదా ఆ పార్టీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న నయా-ఉదారవాద విధానాల విషయంలో మనం ఆ పార్టీకి భిన్నమైన వైఖరిని తీసుకోవాలి. హిందుత్వ మతతత్వ అంశాలపై ఆ పార్టీ తీసుకునే ఎలాంటి రాజీ ధోరణులనైనా మనం విమర్శనాత్మక దృష్టితో చూడాలి.”
ఈ అవగాహనతోనే, 2026 జూన్‌ 8న ఢిల్లీలో ఏర్పాటైన ‘ఇండియా’ బ్లాక్‌ పార్టీల సమావేశానికి ముందు, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్‌) ప్రధాన కార్యదర్శి హోదాలో నేను కాంగ్రెస్‌ అధ్యక్షుడికి ఒక లేఖ రాశాను. ప్రతిపక్ష కూటమిలో అతి పద్ద పార్టీ అయిన కాంగ్రెస్‌ నాయకులు తీసుకున్న కొన్ని విచ్ఛిన్నకర చర్యల గురించి ఆ లేఖ ద్వారా వివరణ కోరాము.
కేరళ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ నాయకత్వం అనుసరించిన ప్రచార వ్యూహంపై స్పష్టమైన అభ్యంతరం వ్యక్తం చేశాం. అటువంటి గందరగోళాన్ని సృష్టించే చర్యలపై కాంగ్రెస్‌ నాయకత్వం స్పష్టత ఇవ్వాలని కోరాం. సిపిఎం, బిజెపి మధ్య ఒప్పందం కుదిరిందని ఆరోపణలు వచ్చాయి. ”ఇది మేము తేలికగా తీసుకోలేని ఒక అవాస్తవ ప్రచారం. బిజెపి కి వ్యతిరేకంగా ఏర్పడిన ఐక్యతకు వ¶లాల నుండే ఇది ముప్పు కలిగిస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి కి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో కేరళలో మా వందలాది మంది కార్యకర్తలు బలయ్యారన్న విషయాన్ని మీరు గుర్తించాలి. ఈ సందర్భంగా మీ దృష్టికి మరో విషయం కూడా తీసుకురావాలనుకున్నాము. కేరళలో గత పదేళ్ల ఎల్‌డిఎఫ్‌ పాలనలో, అనేక ఇతర రాష్రాల్లో మాదిరి కాకుండా, ఎలాంటి మతపరమైన అల్లర్లకు తావు లేకుండా చూశాం. లౌకికవాదం పట్ల మత సామరస్యాన్ని కాపాడటం పట్ల మాకున్న నిబద్ధతకు ఇదే నిదర్శనం.”
మాపై ఇలాంటి అర్థరహితమైన ఆరోపణలు ఎందుకు చేశారో సమాధానమివ్వాలని డిమాండ్‌ చేశాం. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ, అప్పటి కేరళ ముఖ్యమంత్రిపై ఇ.డి చర్య తీసుకోవాలని పదేపదే కోరారు. దీనిని బిజెపి వ్యతిరేక వైఖరి అని అనుకోవాలా లేక తోటి ప్రతిపక్ష నాయకుడిపై చట్టవిరుద్ధమైన శిక్షాత్మక చర్యలు తీసుకునేలా మోడీ ప్రభుత్వాన్ని ఆహ్వానించడంగా భావించాలా? ఈ విషయాలపై స్పష్టత లేకపోతే, ‘ఇండియా’ బ్లాక్‌ ఏర్పాటు ఉద్దేశమే ప్రశ్నార్థకమవుతుంది. ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా, ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది మీరే; అలాగే ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి వ్యతిరేక పోరాటంలో సిపిఐ(ఎం) కూడా కీలక పాత్ర పోషించాల్సి ఉంది. అయితే, కాంగ్రెస్‌ సంకుచిత ధోరణిని ప్రదర్శించినప్పుడు, వారిని మనం ఏమీ అనకుండా వదిలేయలేము. ‘ఇండియా’ బ్లాక్‌ లోని భాగస్వామ్య పక్షాలపై వారు గుప్పిస్తున్న విమర్శలను వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేరళలో సిపిఎం ను, పొలిట్‌బ్యూరో సభ్యుడు పినరయి విజయన్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లే, అంతకు ముందు ఢిల్లీలో ఆప్‌, దాని అగ్రనేత అరవింద్‌ కేజ్రీవాల్‌ను కూడా అలాగే లక్ష్యంగా చేసుకున్నారు. ఇక తమిళనాడులో, ఎన్నికల ఫలితాలు వెలువడగానే వారు కూటమి నుంచి బయటకొచ్చి, దశాబ్దాలుగా నమ్మకమైన భాగస్వామిగా ఉన్న డిఎంకెను వదిలిపెట్టి, కొత్త ప్రభుత్వంలో ఎలాగైనా భాగం కావాలనే అవకాశవాదాన్ని ప్రదర్శించారు. డిఎంకె, ఆప్‌ లేకపోవడం ఈ ఉమ్మడి వేదికను బలహీనపరిచింది. ‘ఇండియా’ బ్లాక్‌ను కేవలం కాంగ్రెస్‌ నేతత్వంలోని పార్టీల కూటమిగా పరిగణించకూడదు. ఇది ప్రారంభంలో ఊహించినట్లుగానే—లౌకిక ప్రతిపక్ష పార్టీల విస్తృత వేదికగా కొనసాగాలి.
రాజకీయ సమీక్షా నివేదిక ముగింపులో మేము ఇలా పేర్కొన్నాము: ”ఎన్నికల కోసం ‘ఇండియా’ బ్లాక్‌తో కలిసి పని చేయడం, అలాగే పార్లమెంటులోనూ, బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ మతతత్వ ఎజెండాకు వ్యతిరేకంగా ఉమ్మడి ఆందోళన కలిగించే అంశాలపై సహకరించుకోవడం కొనసాగించాలి.” భారత ఎన్నికల సంఘం చేపట్టిన ‘సర్‌’ ప్రక్రియపై ఉమ్మడి వైఖరి తీసుకోవడం ఆ స్ఫూర్తితోనే జరిగింది. రాబోయే రోజుల్లో మోడీ ప్రభుత్వం నియజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనను, ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ విధానాన్ని ముందుకు తెచ్చే అవకాశం ఉన్నందున, పార్లమెంటులో ‘ఇండియా’ బ్లాక్‌ భాగస్వామ్య పక్షాలతోనూ, అలాగే డిఎంకె , ఆప్‌ వంటి ప్రతిపక్ష పార్టీలతోనూ సహకారానికి మేము ప్రాధాన్యతనిస్తాము.
అదే సమయంలో, ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి కూటమిని వ్యతిరేకించడంలో తమ బాధ్యతను పూర్తిగా గుర్తిస్తూ, మోడీ ప్రభుత్వ నిరంకుశ, మతతత్వ, ప్రజా వ్యతిరేక విధానాలపై ఉమ్మడి పోరాటం చేయడానికి పార్లమెంటులో ‘ఇండియా’ బ్లాక్‌, ఇతర ప్రతిపక్ష పార్టీలతో మా పార్టీ పూర్తిగా సహకరిస్తుందని స్పష్టం చేశాం. ఎన్ని దాడులు, దుష్ప్రచారాలు చేసినప్పటికీ, ఈ విషయంలో సిపిఎం తన బాధ్యతను నెరవేర్చడంలో ఎప్పుడూ వెనుకడుగు వేయదని పునరుద్ఘాటించాం.
ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి ని ఓడించడానికి ప్రతిపక్షాలన్నీ కలిసి పోరాడాలనే విషయంలో సిపిఎం కి స్పష్టమైన అవగాహన ఉంది. అలాగే, ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి మతతత్వ ఎజెండాకు వ్యతిరేకంగా ఉమ్మడి ఆందోళన కలిగించే అంశాలపై వామపక్షాలు, ఇతర ప్రతిపక్షాలు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని కూడా మాకు తెలుసు. భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియపై ఆ స్ఫూర్తితోనే ఉమ్మడి వైఖరి తీసుకున్నాం. రాబోయే రోజుల్లో మోడీ ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదన, ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ బిల్లులను ముందుకు తెచ్చే అవకాశం ఉన్నందున, పార్లమెంటులో ‘ఇండియా’ బ్లాక్‌ భాగస్వామ్య పక్షాలు డిఎంకె, ఆప్‌ వంటి ప్రతిపక్ష పార్టీలతో సహకారానికి మేము ప్రాధాన్యతనిస్తాము. ప్రజాస్వామ్యంపై దాడులు, లౌకికవాదంపై హిందుత్వ దాడులు, ఫెడరల్‌ వ్యవస్థపై నిరంకుశ దాడులకు వ్యతిరేకంగా బలమైన ఉమ్మడి ప్రతిఘటన ఉండాలి.
ఇటువంటి అన్ని అంశాలపై ‘ఇండియా’ బ్లాక్‌ ఒక ఐక్య వేదికగా పనిచేయాలి. జూన్‌ 8 నాటి సమావేశంలో నిర్ణయించిన ఐదు చర్యలు ఒక సానుకూల పరిణామం.
జీవనోపాధికి సంబంధించిన సమస్యలు అత్యంత ప్రధానంగా ఉన్న కాలంలో మనం జీవిస్తున్నాం. కార్మికులు, రైతులు, యువత , విద్యార్థుల నుండి వెల్లువెత్తుతున్న స్వచ్ఛంద నిరసనలు, భారతీయ ప్రజలలోని వివిధ వర్గాల మధ్య నెలకొన్న అసంతృప్తిని సూచిస్తున్నాయి. కాబట్టి, సామాన్య ప్రజల జీవనోపాధికి సంబంధించిన సమస్యలను మనం చేపట్టడం అత్యవసరం. ఇంధనం, వంట గ్యాస్‌ ధరల నిరంతర పెరుగుదల, లేబర్‌ కోడ్‌ల అమలు, జాతీయ ఉపాధి హామీ పథకం నిర్వీర్యం, ఎరువుల కొరత వంటివన్నీ ప్రజల జీవితాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి, నీట్‌, సిబిఎస్‌ఇ పరీక్షల్లోని లోపాలు, నిరుద్యోగం కారణంగా విద్యార్థులు, యువత తీవ్ర అసహనంతో ఉన్నారు. ఇక్కడ, పార్టీ స్వతంత్రంగానూ, వామపక్షాలు ఐక్యంగానూ శ్రామిక ప్రజల వివిధ వర్గాల పోరాటాలను నిర్వహించాలి. ప్రజల సమస్యలపై పోరాడేందుకు వర్గ ప్రజా సంఘాల మధ్య అత్యంత విస్తృతమైన ఐక్యత అవసరం.
ఒక కార్మిక వర్గ పార్టీగా, వర్గ, పజా సమస్యలను చేపట్టడం మన బాధ్యత. ఉత్తర భారత రాష్ట్రాల్లో ‘జన్‌ ఆక్రోష్‌ యాత్రల’ ద్వారా (ఇవి ఢిల్లీ లోని రామ్‌లీలా మైదాన్‌లో ‘జన్‌ ఆక్రోష్‌ ర్యాలీ’తో ముగిశాయి) మనం అటువంటి ప్రయత్నం చేశాం. దీనికి తోడు, విస్తృతమైన వామపక్ష ఐక్య కార్యాచరణలు, ప్రజాస్వామ్యం, లౌకికవాద పరిరక్షణ కోసం, అలాగే హిందుత్వ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ‘ఇండియా’ బ్లాక్‌ వంటి లౌకిక ప్రతిపక్ష పార్టీల విస్తృత వేదికను ఏర్పాటు చేసుకోవడం నేటి అవసరం. ‘ఇండియా’ బ్లాక్‌ పట్ల మా వైఖరి ఈ స్పష్టమైన రాజకీయ దక్పథం ఆధారంగానే నిర్ణయించబడింది.



 వ్యాసకర్త – సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీ

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్