ఆదివారం, 25 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపోలియో లేని ప్రపంచం కోసం...

8 గంటల క్రితం

polio.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 25, 2026, 05:17 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఒక రకమైన‌ వైరస్‌ కారణంగా ఐదేళ్ల లోపు పిల్లలకు “పోలియో” లేదా “పోలియోమైలిటిస్ అనే వ్యాధి సోకుతుంది. నాడీ వ్యవస్థ శాశ్వతంగా దెబ్బ తిని, కండరాలు బిగుసుకుపోయి కదల్లేని దుస్థితిలో జీవితకాల పక్షవాత సమస్య ఉత్పన్నమై నడవలేని నిస్సహాయ స్థితి ఏర్పడుతుంది. ఎలాంటి చికిత్స అందుబాటులో లేని ఈ వ్యాధికి చిన్నతనంలో పోలియో చుక్కల టీకా ఔషధ మందే శరణ్యం అయ్యింది. పోలియో జబ్బు ఒకటి, రెండేళ్ళ పిల్లలకు అధికంగా వస్తుంది. అపరిశుభ్రమైన వాతావరణంలో పెరిగిన పిల్లల్లో రోగ నిరోధకశక్తి బలపడే అవకాశాలు తక్కువగా ఉండడంతో పోలియో సోకే సంభావ్యత అధికం.

పోలియో సంక్రమించిన 95 శాతం రోగుల్లో వ్యాధి లక్షణాలు కనిపించవు. కొన్ని కేసుల్లో వైరస్‌ తీవ్రతను బట్టి విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం, గొంతు నొప్పి, తల నొప్పి, కండరాల నొప్పి, నడుం నొప్పి, చర్మంపై దద్దుర్లు, కండరాలు బిగుసుకు పోవడం, నీరసం, పక్షవాతం, శ్వాస ఇబ్బంది లాంటి వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. పోలియో తీవ్రత పెరిగితే కోమాలోకి వెళ్ళడం, చివరకు మరణం కూడా సంభవించవచ్చు. పిల్లలకు మలమూత్రాల విసర్జన పట్ల శిక్షణ ఇవ్వడం, పోలియో టీకాలను వైద్యుల సూచనల మేరకు బాల్యంలోనే ఇప్పించడం, ఈగలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం, నీరు కలుషితం కాకుండా చూసుకోవడం, వ్యాధినిరోధకశక్తి పెంచుకోవడం, పరిసరాల పరిశుభ్రత పాటించడం, పోషకాహారం ఇవ్వడం లాంటి నివారణ చర్యలతో పోలియో వ్యాప్తిని కట్టడి చేయవచ్చు. పోలియో నిర్మూలన యజ్ఞంలో భాగంగా పసి పిల్లలకు సకాలంలో పోలియో టీకాలు ఇప్పించడం మరిచిపోరాదు. పోలియో వ్యాధికి చికిత్స లేదు, టీకాలు వేయిస్తూ నిర్మూలించడమే ఏకైక మార్గమని ప్రజల్లో అవగాహన కల్పిద్దాం. భయంకర పోలియో వైరస్‌ను ప్రపంచం నుంచి తరిమేద్దాం.

- డాక్టర్ బుర్ర మధుసూధన్ రెడ్డి,

సెల్‌: 9949700037

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్