ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రక్తరాగ నగరం..

5 గంటల క్రితం

car
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 29, 2026, 05:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

నువ్వెన్ని పరదాలు పరిస్తేనేం

ఇరుకు సందుల్లోంచి

విరిగిన చెక్క కిటికీల్లోంచి

పాత నగరం పలకరిస్తూనే వుంటుంది

పూడ్చేసిన నది వరద పొంగులా!

​

పుస్తకాల్లోంచి పేర్లు కొట్టేయొచ్చు

చరిత్ర దాచి పెట్టిన గుర్తులు

ఎర్ర కోటల్లా ఎక్కిరిస్తూనే ఉంటాయి

రహదారుల బోర్డులెన్ని మార్చినా

నిన్నటి దారులు వెంట నడుస్తూనే ఉంటాయి!

​

సమాధుల్లో సెలవు తీసుకుంటున్న చక్రవర్తులు

నిద్ర పోకుండా తిరుగుతున్నట్టే ఉంటుంది

టికెట్ షోలో చెరిగిపోని నగర వారసత్వంలా

పెచ్చులూడిన గోడల్లోంచి రాలిపడిన ఆత్మల్లా

తేజో మహల్లులా వెంటాడుతూనే ఉంటాయి!

​

పీఠం కోసం జరిగిన ప్రతి పోరులో

నలిగి నుజ్జయిన ప్రజల్లా

ఖూనీ దర్వాజాకి వేలాడుతున్న నగరంలా

బతుకు చిరునామానే గల్లంతవుతుంది

కొత్త రాజ్యంలో బానిస గుర్తింపు కార్డుతో!

​

నూతన నగర నిర్మాణంలో

బుల్డోజర్ కింద పురానా హవేలీ

గల్లీ గొంతునిండా విషాద గజల్

బెదిరి చెదిరిన పావురాల గుంపులా

శృతి కుదరని ప్రేమ గీతంలా రక్తరాగ నగరం!


- కేశవ కుమార్


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్