ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మూడు వాక్యాల్లో...

10 సెప్టెంబర్, 2026

drought
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 11, 2026, 03:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఆకులు రాలుచుకునే

చెట్టుకున్నంత ధైర్యం

మనిషికి ఇప్పుడు లేదు!

​

కరువు ఛాయలు

ఎదలో కల్లోలం

మనిషి పిట్టయ్యి రాలిపోతాడేమో!

​

భూగర్భంలో

ఎడారులు విస్తరిస్తుంటే

మేఘాలు కనుమరుగు!

​

బీటలు వారుతున్న మైదానాలు

పిడికెడు గడ్డి దోసెడు నీళ్లు

ఈ ఊహ ఇప్పుడు పగటి కల!

​

నేరాన్ని కాలంపై నెట్టే

పాలకుల చెవుల్లో

యముని మహిషపు లోహగంటలు!

​

మీకంతా ఎప్పుడు

ఎన్నికల గోలేనా?

ప్రజాసవ్వడి వినబడదా?!

​

భూగోళమంతా

అన్ని భాషల్లో పాలకులంటే

దోపిడీలకు పర్యాయపదాలే!

​

ఎంతో ఎత్తుకు

ఎదిగిన మనిషి గుండెల్లో

ఇంకా బతుకు భయమా... సిగ్గు సిగ్గు!

​

కాలానికి తలొగ్గి సామాన్యుడు

బతుకీడుస్తున్నంత కాలం

నాగరిక సమాజం ఒక మేడిపండే!

- కోట్ల వెంకటేశ్వర రెడ్డి,

సెల్: 94402 33261

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్