ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్కెట్లో నకిలీ ఔషధాల అమ్మకాలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రాణాలను కాపాడాల్సిన ఔషధాలు, ప్రజల ప్రాణాలను తీస్తున్నాయి. సరైన మోతాదులో రసాయనాలు లేని, లేదా హానికరమైన పదార్థాలు కలిగిన మాత్రలు, సిరప్లు నకిలీ బ్రాండ్ల పేర్లతో మార్కెట్లోకి ఎక్కువగా వచ్చేస్తున్నాయి. దీనివల్ల రోగులకు నయం కాకపోగా మరింత తీవ్రమై బాధపడుతున్నారు. అసలు, నకిలీ ఔషధాల మధ్య తేడాను వినియోగదారులు గుర్తించడం అసాధ్యంగా మారుతున్నది. ఈ తీవ్రమైన సమస్యను నివారించడానికి 'ఔషధ నియంత్రణ శాఖ' అధికారులు, పాలకులు మేల్కొనాలి. దేశవ్యాప్తంగా ఉన్న ఔషధాల దుకాణాలపై క్రమం తప్పకుండా దాడులు, తనిఖీలు నిర్వహించాలి. నకిలీ ఔషధాల నెట్వర్క్ ల వెనుక ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేవారిపై వెంటనే కేసులు నమోదు చేయాలి. నకిలీ ఔషధాలను తయారు చేసే కంపెనీల లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేయాలి.
- దాసం వెంకటరెడ్డి,
ఊరదాళ్లపాలెం, ప.గోదావరి జిల్లా.








కామెంట్లు (0)