ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionబియ్యం... ప్రియం!

05 అక్టోబర్, 2026

rice exports
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 06, 2026, 04:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

నిత్యావసర ధరలు నిత్యం పెరగగా

బియ్యం ధరలూ ప్రియమయ్యాయి

మూడు నెలలుగా సన్నగా పెరుగుతూ

సగటు జీవులకు తుకతుక మనిపించే..!

​

డిమాండ్ కి తగ్గ సప్లయి లేకపోగా

తండులానికి గిరాకి పెరిగి పోయింది

బజారులో షాపులలో బియ్యం ధరలు

కయ్యమాడుతుండే సామాన్య ప్రజలతో..!

​

ఎల్ నినో పెను భూతాన్ని చూపించి వరి దిగుబడులు తగ్గుదల చూపించి బియ్యం రేట్లును దండిగా పెంచినారు దళారులు సొమ్ము చేసుకునేందుకు..!

​

దారి మళ్లుతున్న రేషన్ బియ్యంలో

సన్న బియ్యాన్ని మిన్నగా కలుపుతూ

విక్రయిస్తుండే బియ్యం వ్యాపారులు

లక్షలు గడించే రాజకీయ ప్రముఖులు

మోసపోతున్నారు మధ్య తరగతివారు..!

​

నిత్యావసర వస్తువుల ధరవరలు

నింగిలోని సితారలు అవుతున్నా

చుక్కలను చూపిస్తున్నారు దళారులు

ప్రేక్షక పాత్రను పోషించే పాలకులు..!

​

బియ్యం ధరలను పాలకులు తగ్గించాలి

నకిలీ బియ్యాన్ని తనిఖీలో అరికట్టాలి

నాణ్యమైన బియ్యం విక్రయించాలి

సామాన్య ప్రజలను సంతృప్తి పరచాలి..!

​- జి.సూర్యనారాయణ,

సెల్‌: 6281725659.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్