శనివారం, 03 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సాహసికి సలాం ​

22 గంటల క్రితం

jana
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 03, 2026, 05:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

విపత్కర పరిస్థితిలో తెగువ చూపి, తనతో సహా 174 మంది ప్రాణాలు కాపాడిన భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్ సాహసానికి ప్రపంచమంతా అభినందనలు తెలుపుతోంది. దుబాయ్ నుండి ఇజ్రాయిల్ లో టెల్ అవీవ్ కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానాన్ని ఆయన నడుపుతుండగా, సహచర పైలట్ కలబడి, దాడి చేసి, విమానాన్ని అదుపులోకి తీసుకుని అమాంతం కిందికి ఉరికించాడు. ఒక్క నిమిషంలో 15 వేల అడుగులు కిందికి జారిన విమానాన్ని ఒక వైపు కత్తి పోట్లకు గురవుతూనే మచ్చర్ కాపాడడానికి ప్రయత్నించారు. తాము ప్రమాదంలో ఉన్నట్లు, హైజాక్ కు గురయినట్లు సంబంధిత అధికారులకు అలెర్ట్ చేస్తూనే కాక్ పిట్ తెరిచారు. అలాంటి అనూహ్య ఉత్కంఠభరిత పరిస్థితిలో, తీవ్రంగా గాయపడిన ఆయన కాక్ పిట్ తెరవగలగడమే కీలకం. ప్రమాదం గుర్తించిన ప్రయాణీకుల్లో కొందరు లోపలికి ప్రవేశించి దాడి చేస్తున్న కో పైలట్ ని బలప్రయోగంతో నిలువరించగా, తోటి ప్రయాణీకులుగా ఉన్న ఇద్దరు ఆఫ్ డ్యూటీ పైలట్ లు విమానం నడిపే బాధ్యత తీసుకున్నారు. సౌదీ అరేబియాలో సురక్షితంగా ఎమర్జెన్సీ లాండింగ్ చేసి, అందరి ప్రాణాలూ కాపాడారు. మచ్చర్ సమయస్ఫూర్తి, సాహసం వల్లనే పెను ప్రమాదం తప్పింది. దేశ ప్రధానులతో సహా అనేకమంది నుంచి అందుతున్న అభినందనలకు ఆయన ఎంతైనా అర్హుడు.

- డా.డి.వి.జి.శంకరరావు,

మాజీ ఎంపీ, విజయనగరం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్