సముద్రంలో పుట్టిన తుపాను
వికృత నడకలతో వికటాట్టహాసం చేస్తూ
ఒడ్డుకి చేరుతోంది వేల జల ఖడ్గాలతో
కోస్తా తీరమంతా వొణుకుతోంది
ఆక్వాన్ రక్కసి రాస్తా చూసి
తీరప్రాంతం ఇంకా పచ్చి గాయాలకు
పాలాస్త్రి కట్లను కడుతోంది.
కడలి కూడలిలో తీవ్ర తుపాన్
ఆక్వాన్ హల్ చల్ చేస్తోంది
చానల్ లలో ఈదురు గాలుల్లా
తుపాను హోరు వార్తా ప్రకటనలు
ఏ దిక్కుకి ఆ పెను రక్కసి
విరుచుకు పడుతోందని
బిక్కు బిక్కుమంటూ ప్రజలు.
చేతికొచ్చిన వరి పంటలు
చూసి రైతన్నలంతా కన్నీరు
బేరమైన వాణిజ్య సిరులు కాంచి
అన్నదాతలు హలో లక్ష్మణలు.
నెలలోనే మూడు తుపానులు
కోస్తాంధ్ర ప్రజలకి తీరని వ్యథలు
తుపాన్ తీరం దాటేంతవరకు
తీరప్రాంత జనతకి లేదు కునుకు.
అందరూ అప్రమత్తంగా వుండాలి
పాలకులు డేగ కన్నులతో సదా
తుపాన్ ని గమనాన్ని పసిగట్టాలి
ఆస్తి, పంట, ప్రాణ నష్టాలను అరికట్టాలి.
- జి.సూర్య,
సెల్: 6281725659








కామెంట్‌లు (0)