సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అరుణారుణ జెండా మా ఏచూరి

11 సెప్టెంబర్, 2026

sitartam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 12, 2026, 03:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

కాషాయాన్ని నిలువరించి కదం తొక్కు తరుణాన

అరుణారుణ నాయకుడా మమ్ము వీడినావా

విద్యార్థి నాయకుడా ఉద్యమాల ధీరుడా

ఇండియా అంతా ఒకటంటూ నినదించిన వీరుడా

మోస్తాము ఎర్ర జెండ ఢిల్లీ చేరుదాకా

నిను తలుస్తాము ఎప్పుడు మా హృదయం నిండా​

పల్లవి:

మతతత్వపు మత్తులో పొగచూరిన దేశానికి

వేగు చుక్కవే నీవు మా ఏచూరి

శ్రమ జీవుల పార్టీలో ముఖచిత్రమె నీవు

కష్టజీవి ఎదలోన ధైర్యానివి నీవు //2//

చరణం 1:

ఎంతపనీ చేశావు ఓ తెలుగు బిడ్డా

పోరుబాట మధ్యలో ఆగిపోయె నీ గుండె

మా అండగ నీవుంటే అది ఓ పండుగ

సాగిపోవాలి ఇంక అరుణారుణ జెండా

కన్నీటితొ నిండిన మా కన్నుల నిండా

వెలుగులే చిమ్మాలిక నీవే మా అండ//మత//

చరణం 2:

ప్రపంచాన్ని చుట్టేసిన ఓ అరుణ వీరుడా

దేశదేశాలలో కమ్యూనిస్టుల సరిజేసిన

శూరుడవే నీవు ప్రగతిదారుడవే నీవు

భవితవ్యపు బాట నీవు భావానివి నీవు

విశ్వనరుడవే నీవు ఎర్ర జెండ నీడ నీవు

నీ అడుగుల నడుస్తాం నీ రాగం పాడుతాం

//మత//​

చరణం 3:

జీవితాన్ని త్యాగాల ఎరుపుతో నింపావు

దేహాన్ని దేశానికి బహుమతే ఇచ్చావు

సోషలిజం కమ్యూనిజం అర్థమే నీవు

దీక్షబూని చరిత్రనే రాసిన కలమే నీవు

నీ అంకిత భావానికి అందుకో లాల్ సలాం

నిను రోజూ స్మరియిస్తాం ఇదిగో మా లాల్ సలాం//మత//


- జంధ్యాల రఘుబాబు,

సెల్‌: 9849753298

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్