మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅంతర్జాతీయ ఫుట్‌‌బాల్‌‌ మ్యాచ్‌‌లకు అర్జెంటీనా ఆటగాడు నికోలాస్‌ ‌గుడ్‌‌బై

24 జులై, 2026

nicolos
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 24, 2026, 09:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

బ్యూనస్‌ఎయిర్‌: అర్జెంటీనా డిఫెండర్‌ ‌నికోలాస్‌ ఒటమెండి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఫిఫా ప్రపపంచకప్‌ ‌ఫైనల్లో అర్జెంటీనా ఓటమితో అంతర్జాతీయ ఫుట్‌‌బాల్‌ ‌మ్యాచ్‌‌లకు గుడ్‌‌బై చెబుతున్నట్లు శుక్రవారం ప్రకటించాడు. 38ఏళ్ల నికోలస్‌ అర్జెంటీనా తరఫున 17ఏళ్లు జాతీయ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2022లో అర్జెంటీనా జట్టు కోపా అమెరికా టైటిల్‌ ‌కొట్టడంలో కీలకపాత్ర పోషించాడు. అర్జెంటీనా తరఫున 139 మ్యాచుల్లో పాల్గొన్న నికోలాస్‌కు డిఫెండర్‌‌గా అపార అనుభవం ఉంది. ప్రత్యర్ధి జట్టు ఆటగాళ్లు గోల్‌ ‌కొట్టకుండా సమర్ధవంతంగా నిలువరించడంలో కీలకపాత్ర పోషించాడు. ఐరోపాలోని పోర్టో, వాలెన్సియా, మాంచెస్టర్‌ ‌సిటీ మరియు బెన్‌‌ఫికా జట్ల తరఫున 16ఏళ్లపాటు కొనసాగిన నికోలాస్‌.. ఇటీవల అర్జెంటీనాలోని ‘రివర్‌ ‌ప్లేట్‌’క్లబ్‌‌లో చేరాడు. నికోలాస్‌ అర్జెంటీనా తరఫున నాలుగుసార్లు ఫిఫా ప్రపంచకప్‌‌లలో ప్రాతినిధ్యం వహించాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్