మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

​గోడ కట్టి.. కప్‌ ‌కొట్టి...

12 గంటల క్రితం

fifa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 20, 2026, 11:50 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

- ఫిఫా ప్రపంచకప్‌-2026 టైటిల్‌ విజేత

- స్పెయిన్‌ ఫైనల్లో అర్జెంటీనాపై ‌గెలుపు

న్యూయార్క్‌: పటిష్ట డిఫెన్స్‌‌కు మారుపేరైన స్పెయిన్‌ ‌ఫైనల్లో డిఫెండింగ్‌ ‌ఛాంపియన్‌ అర్జెంటీనాకు ‌ముచ్చెమటలు పట్టించింది. బంతిని ఎక్కువభాగం తమ ఆధీనంలోనే ఉంచుకొని, అర్జెంటీనా ఆటగాళ్లకు బంతి చేరగానే వెంటనే దానిని మళ్లీ తమ ఆధీనంలోకి తీసుకోవడమే లక్ష్యంగా స్పెయిన్‌ ఫైనల్లో చెలరేగింది. అర్జెంటీనా కెప్టెన్‌ లియోనెల్‌ మెస్సీకి అసలు బంతి అందకుండా మరింత జాగ్రత్త వహించింది. దీంతో ఆదివారం అర్ధరాత్రి న్యూయార్క్‌ స్టేడియంలో జరిగిన ఫిఫా ప్రపంచకప్‌-2026 ఫైనల్లో స్పెయిన్‌ ‌జట్టు మూడుసార్లు ఛాంపియన్‌ అర్జెంటీనాను ఓడించి రెండోసారి టైటిల్‌‌ను ముద్దాడింది. 2010లో తొలిసారి టైటిల్‌ ‌కొట్టిన స్పెయిన్‌ ‌దాదాపు 16 ఏళ్ల తర్వాత మరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఇక లియోనెల్‌ ‌మెస్సీ సారథ్యంలోని వరుసగా రెండోసారి టైటిల్‌ ‌కొట్టా లన్న అర్జెంటీనా ఆశలు అడియాశలయ్యాయి.

ఫైనల్‌ మ్యాచ్ ఆరంభం నుంచి స్పెయిన్ ఆటగాళ్లు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. దీంతో నిర్ణీత 90 నిమిషాల ఆట ముగిసే సమయానికి ఇరు జట్లు ఒక్క గోల్ కూడా నమోదు చేయలేకపోయాయి. ఫలితం కోసం అదనపు సమయం కేటాయించగా.. తొలి 15 నిమిషాల్లోనూ ఏ జట్టు గోల్‌ ‌చేయలేదు. కానీ రెండో అదనపు సమయం ప్రారంభంలో 106వ నిమిషంలో స్పెయిన్ స్టార్ ఫార్వర్డ్ ఫెర్రాన్ టొర్రెస్ అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. అర్జెంటీనా డిఫెన్స్ ను చీల్చుకుంటూ వెళ్లి కొట్టిన పవర్ ఫుల్ షాట్ నేరుగా అర్జెంటీనా గోల్ పోస్ట్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఒక్క గోల్ తో స్పెయిన్‌ జట్టు చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత స్కోర్‌‌ను సమం చేసేందుకు అర్జెంటీనా చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. మ్యాచ్ మధ్యలో అర్జెంటీనా కీలక ఆటగాడు ఎంజో ఫెర్నాండెజ్‌కు రెఫరీ రెడ్ కార్డ్ చూపించి మైదానం నుంచి బయటకు వెళ్లడం అర్జెంటీనాకు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లయ్యింది. దీంతో అర్జెంటీనా కేవలం 10 మంది ఆటగాళ్లతోనే చివరి, అదనపు సమయం మ్యాచ్‌ను ఆడాల్సి వచ్చింది. మైదానంలో స్పెయిన్ ఆటగాళ్లు ఏకంగా 20 సార్లు గోల్ పోస్ట్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయగా... అర్జెడాల్సిఆటగాళ్లు మాత్రం కేవలం 2 సార్లు మాత్రమే అలాంటి ప్రయత్నం చేయగలిగారు. అర్జెంటీనా గోల్‌కీపర్ మార్టినెజ్ అద్భుతమైన సేవ్‌లతో మొదటి 90 నిమిషాలు జట్టును కాపాడినప్పటికీ, అదనపు సమయంలో స్పెయిన్ ధాటికి లొంగక తప్పలేదు. ఈ మ్యాచ్‌ను అర్జెంటీనా గెలిచి ఉంటే ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్ర లోనే ఒక అరుదైన రికార్డును సాధించేది. ఇప్పటి వరకు ఫుట్‌బాల్ చరిత్రలో ఇటలీ (1934, 1938), బ్రెజిల్ (1958, 1962) జట్లు మాత్రమే వరుసగా రెండుసార్లు ప్రపంచకప్ టైటిల్స్ గెలుచుకున్నాయి. 2022 ఫైనల్లో ఫ్రాన్స్‌ను పెనాల్టీ షూటౌట్‌లో ఓడించిన అర్జెంటీనా, 2026 లో స్పెయిన్ చేతిలో భంగపాటుకు గురవ్వడంతో ఇటలీ, బ్రెజిల్ సరసన నిలిచే ఆ సువర్ణావకాశాన్ని కోల్పోయింది.

అర్జెంటీనా కెప్టెన్‌ లియోనెల్ మెస్సీకి ఇది చేదు జ్ఞాపకంగా మిగిలింది. 8 గోల్స్ కొట్టి గోల్డెన్‌ బూట్‌ రేసులో ఉన్న మెస్సీ ఫైనల్లో ఒక్క గోల్‌ కూడా చేయలేదు. స్పెయిన్ డిఫెండర్ల వ్యూహాల వల్ల పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. దీంతో టోర్నీలో 10 గోల్స్ సాధించిన ఫ్రాన్స్ సంచలనం కిలియన్ ఎంబాప్పే అత్యధిక గోల్స్ చేసిన ఆటగానిగా గోల్డెన్ బూట్ అవార్డును మరోసారి కైవసం చేసుకున్నాడు.

ఫిఫా వరల్డ్ కప్ మొత్తం ప్రైజ్ మనీ..

ఫిఫా వరల్డ్ కప్ టోర్నీలో ఛాంపియన్, రన్నరప్‌తో పాటు సెమీఫైనల్, లీగ్ దశలో పాల్గొన్న జట్లకు ఫిఫా ప్రైజ్‌ మనీ వివరాలను వెల్లడించింది. ఈ టోర్నీ మొత్తం ప్రైజ్ మనీ 871 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో ఏకంగా 8,400 కోట్ల రూపాయలు. గత ప్రపంచకప్‌తో పోలిస్తే ఫిఫా ఈసారి ప్రైజ్ మనీని భారీగా పెంచింది. ఇక ఈ వరల్డ్ కప్ లో పాల్గొన్న మొత్తం 48 జట్లు అందజేయనున్నట్లు ప్రకటించింది.

అవార్డులు, ప్రైజ్‌ ‌మనీ..

విజేత: స్పెయిన్: రూ.481కోట్లు

రన్నరప్: అర్జెంటీనా: రూ.318కోట్లు

3వ స్థానం: ఇంగ్లండ్‌: రూ.279కోట్లు

4వ స్థానం : ఫ్రాన్స్‌: రూ.259కోట్లు

క్వార్టర్‌ ఫైనల్స్‌ : రూ.183కోట్లు(ఒక్కో జట్టుకు)

ప్రీ క్వార్టర్‌‌ఫైనల్స్‌: రూ.144కోట్లు( ,, )

రౌండ్‌-32: రూ.106కోట్లు( ,, )

గ్రూప్‌ ‌స్టేజ్‌ ‌జట్లకు: రూ.87కోట్లు( ,, )

గోల్డెన్ బూట్: ఎంబాప్పే(ఫ్రాన్స్10గోల్స్)

గోల్డెన్ గ్లోవ్: ఉనై సిమోన్ (స్పెయిన్)

గోల్డెన్ బాల్: రోడ్రి (స్పెయిన్)

బెస్ట్ యంగ్ ప్లేయర్ : పౌ కుబార్సీ (స్పెయిన్)

ఫిఫా ఫెయిర్ ప్లే ట్రోఫీ : నెదర్లాండ్స్

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్