ఈ విజయం దేశానికి గర్వకారణం: కింగ్ ఫెలిపే
‘స్టార్స్ షైన్ టుగెదర్’ సందేశంతో టాప్‌లెస్ బస్‌పై సంచారం
మాడ్రిడ్: ఫిఫా ప్రపంచకప్ 2026 టైటిల్‌తో స్వదేశానికి చేరిన స్పెయిన్ ఫుట్‌బాల్ జట్టుకు అపూర్వ స్వాగతం లభించింది. మాడ్రిడ్ వీధుల్లో ట్రోఫీతో వస్తున్న ఆటగాళ్లను చూసేందుకు లక్షలాది మంది అభిమానులు తరలివచ్చారు. 26 మంది ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బందితో కూడిన స్పెయిన్ బృందం మాడ్రిడ్ చేరుకొని తొలుత రాజు ఫెలిపే-6కు ట్రోఫీ అందజేశారు. అనంతరం ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్‌ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. "మీ ఆటతీరు, కృషి, విజయం దేశానికి గర్వకారణం. మీ ఆటను చూసి నిజంగా ఆనందించాం" అని సాంచెజ్ అన్నారు. ఆ తర్వాత జట్టు ఓపెన్‌టాప్ బస్సులో నగర మధ్యగా విజయోత్సవ ప్రదర్శన నిర్వహించారు. టాప్‌లెస్ బస్సుపై "స్టార్స్ షైన్ టుగెదర్" అనే సందేశంతో పాటు ఆటగాళ్ల చిత్రాలు ఏర్పాటు చేశారు. వరల్డ్‌కప్ ట్రోఫీని చేతబట్టి, "సోమోస్ కాంపియో నెస్" (మేమే ఛాంపియన్లు) అని ముద్రించిన టీ షర్టులు ధరించిన ఆటగాళ్లు అభిమానులకు అభివాదం చేస్తూ నృత్యాలు చేశారు.
సిబెలెస్ స్క్వేర్‌లో సంబరాలు...
ప్రధానమంత్రి అధికార నివాసమైన మోంక్లోవా ప్యాలెస్ సమీపం నుంచి చారిత్రక వీధుల మీదుగా జట్టు సిబెలెస్ స్క్వేర్‌కు చేరుకుంది. అక్కడ జరిగిన కార్యక్రమానికి సుమారు 1.2 లక్షల మంది హాజరైనట్లు స్థానిక మీడియా తెలిపింది. వేదికపై ఆటగాళ్లను ఒక్కొక్కరిని పరిచయం చేశారు. 25వ పుట్టినరోజు జరుపుకున్న అలెక్స్ బయెనా వరల్డ్‌కప్ ట్రోఫీతో వేదికపైకి వచ్చారు. కోచ్ లూయిస్ డి లా ఫుయెంటేను ఆటగాళ్లు గాల్లోకి ఎత్తి సంబరాలు చేసుకున్నారు. స్ట్రైకర్ బోర్జా ఇగ్లేసియాస్ కొంతసేపు డీజేగా మారగా, మిగతా ఆటగాళ్లు వేదికపై నృత్యాలు చేశారు. గాయనులు ఐటానా, ఆనా మేనా, లోలా ఇండిగో ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు.
చరిత్ర సృష్టించిన స్పెయిన్...
2023లో మహిళల జట్టు, 2026లో పురుషుల జట్టు ఫిఫా ప్రపంచకప్ టైటిళ్లు రెండు ప్రపంచకప్‌లు గెలిచిన తొలి దేశంగా స్పెయిన్ చరిత్ర సృష్టించింది. 2010లో వరల్డ్‌కప్ గెలిచినప్పుడు అప్పుల భారం, నిరుద్యోగం, ప్రాం తీయ స్వయం ప్రతిపత్తి ఉద్యమాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న స్పెయిన్.. ఇప్పుడు ఆర్థికంగా బల పడింది.










కామెంట్‌లు (0)