ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎంబాపె మ్యాజిక్

10 జులై, 2026

fifa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 11, 2026, 12:30 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ఫిఫా ప్రపంచ కప్ సెమీస్​కు ఫ్రాన్స్‌

క్వార్టర్‌ ‌ఫైనల్లో మొరాకోపై 2-0తో గెలుపు

బోస్టన్‌(అమెరికా): బోస్టన్‌ ‌స్టేడియం వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్ 2026 తొలి క్వార్టర్‌ ‌ఫైనల్లో 2022 రన్నరప్‌ ‌ఫ్రాన్స్‌ ‌సత్తా చాటింది. ఆ జట్టు స్టార్‌ ఆటగాడు ఎంబాపే అద్భుత ప్రదర్శనతో రాణించాడు. ఉత్కంఠభరితంగా సాగిన క్వార్టర్ ఫైనల్ పోరులో మాజీ ఛాంపియన్ ఫ్రాన్స్ ఆఫ్రికన్ దిగ్గజ జట్టు మొరాకోపై 2-0 తేడాతో ఘన విజయం సాధించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రపంచకప్ చరిత్రలో ఫ్రాన్స్ వరుసగా సెమీస్‌కు చేరడం ఇది మూడోసారి. ఖతార్ వేదికగా జరిగిన 2022 ప్రపంచకప్ సెమీఫైనల్లోనూ మొరాకోను 2-0తో ఓడించిన ఫ్రాన్స్, 2026లోనూ అదే స్కోరుతో నెగ్గి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం విశేషం. దీనితో వరుసగా మూడు ప్రపంచకప్ టోర్నీల్లో ఫైనల్ చేరిన మూడో జట్టుగా రికార్డు సృష్టించేందుకు ఫ్రాన్స్ అడుగు దూరంలో నిలిచింది.

​మ్యాచ్ ప్రారంభం నుంచే ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఫ్రాన్స్ స్టార్ స్ట్రైకర్ కిలియన్ ఎంబాపె నేతృత్వంలో వరుస అటాక్స్ చేసినప్పటికీ, మొరాకో డిఫెండర్లు అంతే దీటుగా తిప్పికొట్టారు. మ్యాచ్ 28వ నిమిషంలో ఫ్రాన్స్‌కు లభించిన పెనాల్టీ టర్నింగ్ పాయింట్‌గా మారుతుందని భావించారు. బాక్స్ లోపల ఎంబాపెను మొరాకో ఆటగాడు కింద పడేయడంతో రెఫరీ పెనాల్టీ ప్రకటించారు. అయితే, ఎంబాపె కొట్టిన పవర్‌ఫుల్ షాట్‌ను మొరాకో గోల్‌కీపర్ యాసిన్ బౌనో అద్భుతమైన డైవ్‌తో అడ్డుకున్నాడు. యూరో 2020 తర్వాత ఎంబాపె అంతర్జాతీయ మ్యాచ్‌లో పెనాల్టీ మిస్ చేయడం ఇదే తొలిసారి. దీంతో తొలి అర్ధబాగంలో ఏ జట్టూ గోల్‌ చేయలేదు.

రెండో అర్ధబాగంలో ఎంబాపె విశ్వరూపం చూపించాడు. మ్యాచ్ 60వ నిమిషంలో మొరాకో డిఫెండర్లను తప్పించుకొంటూ క్లాసిక్ గోల్ కొట్టి ఫ్రాన్స్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఈ గోల్‌తో ఎంబాపె ప్రపంచకప్ చరిత్రలో తన 20వ గోల్‌ను సాధించి అర్జెంటీనా స్టార్‌ లియోనెల్ మెస్సి (21 గోల్స్) రికార్డుకు చేరువయ్యాడు. ఆ తర్వాత కేవలం ఆరు నిమిషాల వ్యవధిలోనే (66వ నిమిషంలో) ఉస్మాన్ డెంబెలే మైదానాన్ని షేక్ చేశాడు. ఎంబాపె ఎడమ వైపు నుంచి బంతిని పాస్ చేయగా, డెంబెలే 20 గజాల దూరం నుంచి కుడికాలి వాలీతో మెరుపు షాట్ కొట్టాడు. ఈ టోర్నీలో డెంబెలేకు ఇది ఐదో గోల్. బెల్జియం-స్పెయిన్‌ ‌మ్యాచ్‌ ‌విజేతతో సెమీస్‌‌లో ఫ్రాన్స్‌ ‌తలపడనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్