సోమవారం, 20 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

FIFA: స్పెయిన్‌ అ'ద్వి'తీయం

17 గంటల క్రితం

fifa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 20, 2026, 06:30 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • సాకర్‌ సింహాసనంపై రెండోసారి

  • ఫిఫా ఫైనల్లో అర్జెంటీనాపై 1-0 తేడాతో కప్‌ కైవసం

  • ఫెర్రాన్ టోర్రెస్ అద్భుత గోల్‌

  • ఉత్కంఠ ఫైనల్లో అర్జెంటీనాపై గెలుపు

  • చెదిరిన మెస్సీ కల

  • ఎంబాప్పేకు గోల్డెన్‌ ‌బూట్‌

​ సాకర్‌ సింహాసనంపై స్పెయిన్‌ రెండోసారి కొలువుదీరింది. న్యూజెర్సీలోని మెట్‌లైఫ్‌ స్టేడియంలో అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఫిఫా వరల్డ్‌ కప్‌ - 2026 ఫైనల్‌ మ్యాచ్‌లో అద్వితీయమైన ఆటతీరుతో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అర్జెంటీనాపై 1-0 గోల్స్‌ తేడాతో స్పెయిన్‌ విశ్వవిజేతగా నిలిచింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు గోల్స్ చేయలేకపోయాయి. దీంతో అదనపు సమయంలో స్పెయిన్ స్టార్ ఫార్వర్డ్ ఫెరాన్‌ టోరేస్‌ అద్భుతమైన గోల్ చేసి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 2010లో మొదటిసారి ప్రపంచ కప్‌ను ముద్దాడిన స్పెయిన్, ఇప్పుడు రెండోసారి విశ్వవిజేతగా నిలిచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానుల మన్ననలను అందుకుంది.


న్యూయార్క్: ఫిఫా ప్రపంచకప్‌-2026 విశ్వవిజేతగా స్పెయిన్‌ ‌నిలిచింది. న్యూజెర్సీలోని మెట్‌లైఫ్‌ స్టేడియంలో ఆదివారం అర్ధరాత్రి ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో స్పెయిన్‌ ‌జట్టు 1-0తో డిఫెండింగ్‌ ‌ఛాంపియన్‌ అర్జెంటీనాను ఓడించింది. తొలి రెండు అర్ధభాగాలు ముగిసేసరికి ఇరుజట్లు గోల్స్‌ ‌చేయడంలో విఫలమయ్యాయి. దీంతో ఫలితం కోసం అదనపు సమయం కేటాయించగా.. తొలి అర్ధభాగం అదనపు సమయంలోనూ ఏ జట్టూ గోల్‌ ‌చేయలేదు. కానీ రెండో అదనపు సమయం అర్ధభాగం ప్రారంభంలోనే 109వ నిమిషంలో ఫెర్రోన్‌ ‌టొరేన్‌ ‌గోల్‌ ‌చేయడంలో స్పెయిన్‌ 1-0 ఆధిక్యతలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత అర్జెంటీనా పలుమార్లు స్పెయిన్‌ ‌గోల్‌‌పోస్ట్‌‌పై దాడులు చేసినా ప్రయోజనం లేకపోయింది. మ్యాచ్‌ తొలి అర్ధభాగంలో (45+4) ఇరు జట్లు ఖాతా తెరవలేకపోయాయి. రెండో అర్ధభాగంలోనూ ఇరుజట్లు గోల్‌ ‌చేయడంలో విఫల మయ్యాయి. ఈ మ్యాచ్‌‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ముఖ్య అతిథిగా హాజరై వీక్షించారు. తొలి అర్ధ భాగం అనంతరం విరామ సమయంలో ప్రముఖ సింగర్‌లు షకీరా, జస్టిన్‌ బీబర్‌లు తమ సంగీత ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఫిఫా వరల్డ్‌కప్‌ చరిత్రలో ఫైనల్‌ మ్యాచ్‌ మధ్యలో హాఫ్‌ టైమ్‌ షో (సాంస్కృతిక ప్రదర్శనలు) నిర్వహిం చడం ఇదే తొలిసారి. తొలి అర్ధభాగం సమయం ముగిసేసరికి ఏ ఒక్క జట్టు గోల్‌ ‌చేయలేదు. అర్జెంటీనా కెప్టెన్‌ ‌లియోనెల్‌ ‌మెస్సీని కట్టడి చేయడంలో స్పెయిన్ ఆటగాళ్లు సఫలమయ్యారు. ఇక రెండో అర్ధభాగంలోనూ అర్జెంటీనా, స్పెయిన్‌ ‌జట్లు గోల్‌ ‌కోసం శాయశక్తులు ఒడ్డినా ప్రయోజనం లేకపోయింది. మ్యాచ్‌ (90+3) మరో రెండు నిమిషాల్లో ముగుస్తుందనగా అర్జెంటీనా ఆటగాడు ఎంజో ఫెర్నాండెజ్‌ ‌రెడ్‌ ‌కార్డుకు గురయ్యాడు. దీంతో అర్జెంటీనా జట్టు 10మంది ఆటగాళ్లతోనే మిగిలిన ఆట ఆడాల్సి వచ్చింది. అయినా అర్జెంటీనా చివరి నిమిషం వరకు పోరాడింది. కానీ స్పెయిన్‌ పటిష్ట డిఫెన్స్‌ ‌ముందు నిలువలేకపోయింది. ఈ టోర్నీ ప్రారంభం నుంచి 2010 ఛాంపియన్‌ ‌స్పెయిన్‌ అద్భుత ప్రదర్శనను కనబర్చింది. టోర్నీ మొత్తమ్మీద ప్రత్యర్ధి జట్టుకు కేవలం ఒకే ఒక్క గోల్‌ ‌సమర్పించుకొం దంటే ఆ జట్టు డిఫెన్స్‌ ఎంత బలంగా ఉందనడా నికి ఇది ఒక నిదర్శనం స్పెయిన్‌ ‌జట్టు టోర్నీ చరిత్రలో రెండుసార్లు ఫైనల్‌‌కు చేరి రెండుసార్లు టైటిల్‌ ‌కొట్టింది. మరోవైపు అర్జెంటీనా కెప్టెన్‌ ‌లియోనెల్‌ ‌మెస్సీ వరుసగా రెండోసారి టైటిల్‌ అందించి ‌గ్రాండ్‌‌గా రిటైర్మెంట్‌ను చేయాలన్న కల చెదిరింది.


fifa

విజయోత్సవం

fifa



కప్ తెచ్చిన కిక్

goal

గోల్ వచ్చిన ఆనందంలో . .

messiకన్నీరు పెట్టుకున్న మెస్సీ


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్