అంతు చిక్కని ఆకాశం ఎవరితోనూ పోటీపడదు
నిశ్చలంగా విస్తరించి ఆకాశమే హద్దుగా ఎగరాలనుకునే వారికోసం ఎదురుచూస్తూంటుంది
ఆకాశం మనకిచ్చే సందేశం
ఎదుగుదలకు హద్దులు _పెట్టుకోవద్దనీ
అందుకోలేమనే ఎత్తులకు
ఎగరాలనుకునే ధైర్యం
చేరుకోవాలనే కలలు నిండుగా ఉంటే
అవకాశాల ప్రపంచం ఎపుడూ
తెరిచే ఉంటుంది
జీవితంలో ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా
ఎన్నెన్ని _అపజయాలు ఎదురైనా
మనిషి మాత్రం ఎన్నటికీ అంతమైపోడు
ఓటమి నుంచే కొత్త బలాన్ని పుంజుకుని
తిరిగి సరికొత్త శక్తితో లేచి నిలవగలడు
పడిపోవడం ఓటమి కాదని
పడినా మళ్లీ లేవకపోవడమే నిజమైన ఓటమి!
ఉవ్వెత్తున ఎగిసిన నిన్నటి అలలు
తలలువంచి సముద్రపు ఒడిలో సేదతీరినా
కర్కశ అణచివేతలకు తత్కాలం
ఆగిన ప్రజాఉద్యమాలు తిరిగి అందుకోక తప్పవని
అదను చూసి ఫీనిక్స్ పక్షిలా
అవి ఆకాశాన్ని చేరుకోవాలని
అజేయంగా ఎగరటం మాత్రం
ఎన్నటికీ మానవనేది నిజం !
డా. కె. దివాకరాచారి
9391018972








కామెంట్‌లు (0)