ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionహైకూలు....!

1 గంట క్రితం

raithu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 26, 2026, 07:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

వానలో

మట్టి వాసన..

సుఖ స్పర్శలో నేల!

​జీవ నదుల్లో_

మట్టి క్షేత్రాల్లో_

జీవన.. సృష్టి!

ఆకాశం

రాల్చిన నెలవంకలు_

చినుకులు !

పూదొటలో..

తూనీగ సవ్వడి

పూలు విరిశాయి!

ముసురు గాలివాన_

భూమిని

హత్తుకుంది!

జాబిలిపై

బొమ్మలేసిన

సూర్య కాంతి!

​​

చెట్ల ఆకుల్లో

చినుకు రాలి

చిరు సవ్వడి!

​​

నీటిలో

కలువలు

ఓ నిశ్శబ్ద నృత్యం!

​​

కురువని

మేఘం

ప్రకృతి నీటి చిత్రం!

​​

తోటలో

వికసించిన పూలతో

పూరెమ్మ!

​​

దిగులు మేఘాలు

దాచిన

వెలుగు నక్షత్రాలు!

కౌలు_ రైతు

కల్లంలో

తొలి ధాన్యం

జావ కోసం !

అన్నవరపు శ్రీనాధ వర్మ

9618210481.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్