మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనియంతలకు మరో పాఠం

19 జులై, 2026

oil .jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 19, 2026, 08:13 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఏదో ఒక రోజు

నువ్వు ఓడిపోక తప్పదు

చరిత్ర చెప్పిన సత్యం

నీలాంటి మూర్ఖులకు అర్థంకాదు

అవమానాన్నైనా భరిస్తారు కానీ

అహంకారాన్ని

ప్రపంచ ప్రజలు క్షమించరు

మరణాల వ్యాపారికి

పరువు నిలబడుతుందని

ఎలా అనుకుంటావు!

విపక్షానిదైనా

స్వపక్షానిదైనా

చావు నీకొక బేరం

మహా శబ్దమై కూలిన ఆవాసాలు

దేహాన్ని వీడిన అవయవాలు

ఆకాశాన్నంటిన

తల్లుల కడుపు మంటలు

చల్లారిపోయిన కేరింతలు

సమాధుల్లో...

భవిష్యత్తును పునర్నిర్మించుకునే

విషాధ ముఖాలు

నీ పేరును తొక్కుకుంటూ వెళతాయి

నీ స్థాయిని ఆయిల్ బావుల కంటే లోతున

పూడ్చి పెడతాయి

నీ చెవికెక్కకపోయినా

నీ పతనం

భవిష్యత్తు నియంతలకు

మరో పాఠమై నిలుస్తుంది

పాణిరావు యర్రగుంట్ల

62817 19414


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్