గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవాకిలంత చెట్టు . .

4 రోజుల క్రితం

మా వాకిట్లో చెట్టు నాతో పాటే  పెరిగి వాకిలంత ---
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 05, 2026, 08:47 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

మా వాకిట్లో చెట్టు నాతో పాటే

పెరిగి వాకిలంత ---

నేను పుట్టగానే మా నాన్న

ప్రకృతి ఆరాధనగా నాటిన చెట్టు !

అమ్మ రోజూ బిందెడు నీళ్లు పోసి

సేంద్రియ ఎరువు వేసి పెంచిన చెట్టు!


చెట్టు పైకి ఎక్కడెక్కడి పక్షులో వచ్చి వాకిట్లో చల్లే

నూకలను పోటిపడి ఏరుకుని తింటున్నాయి

చెట్టు పై గూడు కట్టుకుని

శాశ్వతంగా కాపురం ఉంటున్నాయి


మా ముంగిట చెట్టు ఎప్పుడు పచ్చని వసంతంగా

రకరకాల పక్షులతో అంగడైపోయింది


ఈ చెట్టు కింద

ఇప్పుడు మా మనుమలు ఆడుకుంటున్నారు

చెట్టు పాఠం నేర్చు కుంటున్నారు


ఈ చెట్టు గాలికి మబ్బులు ఆగి ఆగి చల్లబడి

వానకాలమంతా జడి వానను కురిపించి

వరద వరద చేస్తాయి

ఇక్కడ వర్షపాతం వందశాతం !

చెట్టంటే నీడ !

చెట్టంటే పండు !

చెట్టంటే కాలుష్య నివారిణి !

చెట్టంటే పక్షుల గల్లీ !

చెట్టంటే భేద భావం లేకుండా అందరికీ

ప్రాణవాయువు పంచే వృక్షదేవత!


మా వాకిట్లోని చెట్టును చూసి

మా ఇరుగు పొరుగు వారు

ఇంటి ముందు చెట్లు నాటుకుంటున్నారు !

పోటీపడి నీళ్లు పోస్తున్నారు !

ఇప్పుడు మా వీధిలో అందరి ఇండ్లల్లో

రకరకాల చెట్లే

మా వీధి మా పక్క వీధికీ ఆదర్శం


కందాళై రాఘవాచార్య

8790593638

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్