ఆదివారం, 12 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవెలుగై మాట్లాడింది

1 గంట క్రితం

light kavitha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 12, 2026, 08:19 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

మౌనం పరుచుకున్న గదిలో

ఏకాకితనం అసంపూర్ణ చిత్రంలా

ఉలికులికి పడుతోంది

వచ్చిన వాన నేలతో కాసేపు ఐనా

కబుర్లాడకుండానే వెళ్లిపోయింది

చెట్లను వదిలి పిట్టలన్నీ

గూడు బాట పట్టాయో ఏమో

కొమ్మల కనుపాపలు కల్లోలమై

నిర్లిప్తంగా మారాయి

ఆకాశపు అరుగుపై కూర్చున్న అర్ధచందురుడు

వలసెళ్ళిన వెన్నెల గురించి మదన పడుతున్నాడు

ఒక్క మిణుగురు మాత్రమే దగ్గరగా చేరి

వెలుగై మాట్లాడింది ఘనంగా..


రాధ తాళ్లూరి

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్