శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నాన్నకు ప్రేమతో...

6 రోజుల క్రితం

With love to Dad
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026, 07:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

మా నాన్నకు కోపమెక్కువ...

కానీ ఆ కోపం వెనుక నాపై ప్రేమ ఉండేది.

నేను ఆలస్యంగా వస్తే అమ్మను అడిగేవారు...

నేను చదవకపోతే అమ్మనే మందలించేవారు...

అప్పుడు నాన్నకు కోపమే ఎక్కువ అనుకునేవాడిని.

ఒకరోజు జ్వరం వచ్చినప్పుడు మాత్రం ఆ ప్రేమ అర్థమైంది.

అందరూ నిద్రపోయాక వచ్చి

నా నుదుటిపై చెయ్యేసి చూశారు.

ఆ చేతిలో కోపం లేదు... కేవలం ప్రేమ మాత్రమే ఉంది.

ఇప్పుడు ఆ చేతి లేదు... ఆ స్వరం లేదు...

“ఎక్కడికి వెళ్లావురా?” అని అడిగే నాన్న లేరు.

కానీ ఆయన చెప్పిన మాటలు నాతోనే ఉన్నాయి.

ఆయన నేర్పిన మంచి నడవడి నా జీవితంలో ఉంది.

నేను వేసే ప్రతి అడుగులో ఆయన జ్ఞాపకం ఉంది.

నేను సాధించే ప్రతి విజయానికి ఆయన కష్టం ఉంది.

నాన్న దూరమైనా...

ఆయన ప్రేమ మాత్రం దూరం కాలేదు.

ఆయన జ్ఞాపకాలు నాకు ఎప్పుడూ తోడుగా ఉంటాయి.

నాన్నా... మీ కోపం వెనుక ఉన్న

ప్రేమను ఆలస్యంగా అర్థం చేసుకున్నా.

మీరు లేరు... కానీ మీ మాటలు నా గుండెల్లో ఉన్నాయి.

మీ ఆశీర్వాదం ఎప్పుడూ నాతోనే ఉంటుందని నమ్ముతున్నాను.

నాన్నా... మీరు నా జీవితంలో ఎప్పటికీ చెరిగిపోని జ్ఞాపకం.

​

జి. నవీన్‌కుమార్‌

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్