ఆదివారం, 08 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionటపాసులకు తోడు మిఠాయిలు..

11 గంటల క్రితం

sweets.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 08, 2026, 10:15 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

దీపాల పండుగ దీపావళి వచ్చేసింది! పిండి వంటలు, బాణాసంచా సందడితో పాటు నోరు తీపి చేసుకునేందుకు స్వీట్లు తప్పనిసరి. అయితే ఈసారి మార్కెట్లో కొనే పని లేకుండా, స్వచ్ఛమైన నెయ్యి, డ్రై ఫ్రూట్స్‌తో ఎంతో హైజీనిక్‌గా చేసుకోవచ్చు. దీపావళి పండుగను మరింత తీపిగా మార్చడానికి, సులువుగా, ఎంతో రుచిగా ఇంట్లోనే తయారుచేసుకోగల అద్భుతమైన వెరైటీ స్వీట్ రెసిపీలు మీకోసం. నోట్లో వేస్తే కరిగిపోయే కాజూ కట్లీ నుంచి రాయల్ లుక్ ఇచ్చే బాదం హల్వా వరకు.. ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.

images(2).jpg

మోతీచూర్ లడ్డు

కావలసినవి: శనగపప్పు (పచ్చి శనగపప్పు), చక్కెర, నెయ్యి, ఇలాచీ పొడి, ఫుడ్ కలర్ (ఆరెంజ్), డ్రై ఫ్రూట్స్.

తయారీ : శనగపప్పును నాలుగు గంటలు నానబెట్టి, నీరు లేకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న వడల్లాగా నెయ్యి లేదా నూనెలో వేయించుకోవాలి. ఇవి చల్లారాక మిక్సీలో వేసి చిన్న బూందీలా గ్రైండ్ చేయాలి. మరో పక్క చక్కెర పాకం (తీగ పాకం కంటే కొంచెం తక్కువ) పట్టి, అందులో ఫుడ్ కలర్, ఇలాచీ పొడి, గ్రైండ్ చేసిన బూందీ వేసి కలిపి, ఐదు నిమిషాలు ఉడికించి లడ్డూలుగా చుట్టుకోవాలి.

kaju.jpg

కాజూ కట్లీ

కావలసినవి: జీడిపప్పు, చక్కెర, నీరు, నెయ్యి, ఇలాచీ పొడి.

తయారీ : జీడిపప్పును మెత్తని పౌడర్‌లా చేసుకోవాలి. బాణలిలో చక్కెర, కొద్దిగా నీరు పోసి తీగ పాకం రానివ్వాలి. అందులో జీడిపప్పు పొడి, కొద్దిగా నెయ్యి వేసి దగ్గరకు పడేవరకు కలపాలి. ఆ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్‌లోకి తీసుకుని, చల్లారకముందే చపాతీలా ఒత్తి, కావలసిన ఆకారంలో (డైమండ్ షేప్) కట్ చేసుకోవాలి.

b12c50f8e85c8d55c6b033f6113d3966.jpg

బాదం హల్వా

కావలసినవి: బాదం పప్పులు, పాలు, చక్కెర, నెయ్యి, కుంకుమపువ్వు, ఇలాచీ పొడి.

తయారీ : బాదం పప్పులను వేడి నీళ్లలో నానబెట్టి పొట్టు తీసేయాలి. వాటిని కొద్దిగా పాలు పోసి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. బాణలిలో నెయ్యి వేసి ఈ బాదం పేస్ట్‌ను పచ్చివాసన పోయేవరకు వేయించాలి. తర్వాత చక్కెర, కుంకుమపువ్వు పాలు వేసి బాగా దగ్గరకు పడేవరకు ఉడికించాలి. మిశ్రమం పాన్‌కు అంటుకోకుండా నెయ్యి పైకి తేలుతున్నప్పుడు ఇలాచీ పొడి చల్లి దించేయాలి.

rasamali.jpg

రసమలై

కావలసినవి: పాలు, నిమ్మరసం (పన్నీర్ కోసం), చక్కెర, కుంకుమపువ్వు, బాదం, పిస్తా పలుకులు.

తయారీ : లీటర్ పాలను మరిగించి నిమ్మరసం పోసి విరగ్గొట్టాలి. ఆ పన్నీర్‌ను వడకట్టి, బాగా నూరి చిన్న బిళ్ళల్లా చేసుకోవాలి. వీటిని చక్కెర పాకంలో వేసి 10 నిమిషాలు ఉడికించాలి. మరోపక్క పాలను సగం అయ్యేవరకు మరిగించి, చక్కెర, కుంకుమపువ్వు, డ్రై ఫ్రూట్స్ వేసి రబ్డీ సిద్ధం చేయాలి. చక్కెర పాకంలో ఉడికిన పన్నీర్ బిళ్ళలను తీసి ఈ రబ్డీలో వేసి ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా వడ్డించాలి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్