శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionప్రయోగశాల సందర్శనతో.. సైన్స్‌పై ఆసక్తి!

15 నవంబర్, 2026

నో బ్యాగ్‌ డే సందర్భంగా మా మున్సిపల్‌ మోడల్‌ ప్రైమరీ స్కూల్‌ ఉపాధ్యాయులు మమ్మల్ని
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026, 10:36 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

హాయ్‌ ఫ్రెండ్స్‌!

నో బ్యాగ్‌ డే సందర్భంగా మా మున్సిపల్‌ మోడల్‌ ప్రైమరీ స్కూల్‌ ఉపాధ్యాయులు మమ్మల్ని పుంగనూరు మున్సిపాలిటీలోని బసవరాజా జూనియర్‌ కళాశాలకు క్షేత్ర పర్యటనకు తీసుకెళ్లారు. ఈ పర్యటన మాకు ఎంతో కొత్త అనుభూతిని, విజ్ఞానాన్ని అందించింది. మొదట ఫిజిక్స్‌ ల్యాబ్‌ను సందర్శించాం. అక్కడ వివిధ శాస్త్రీయ పరికరాలను చూశాం. కాంతి, ధ్వని, విద్యుత్‌, అయస్కాంత శక్తి, గురుత్వాకర్షణ వంటి భౌతిక శాస్త్ర అంశాలకు సంబంధించిన పరికరాల గురించి ఫిజిక్స్‌ అధ్యాపకులు పవన్‌ వివరించారు. అద్దాల ద్వారా కాంతి పరావర్తనం ఎలా జరుగుతుంది? విద్యుత్‌ పరికరాలు ఎలా పనిచేస్తాయి? అయస్కాంతం ఇనుము వస్తువులను ఎందుకు ఆకర్షిస్తుంది? వంటి విషయాలను తెలుసుకున్నాం. పుస్తకాల్లో చదివిన అంశాలను ప్రయోగ పరికరాల ద్వారా చూడటం మాకెంతో ఆసక్తిని కలిగించింది. తర్వాత బయాలజీ ల్యాబ్‌ను సందర్శించాం. అక్కడ వివిధ జంతువుల నమూనాలను చూశాం. వాటి శరీర నిర్మాణం, జీవన విధానం, ప్రత్యేక లక్షణాల గురించి జువాలజీ అధ్యాపకులు వివరించారు. వివిధ జంతువుల అవయవాలు, వాటి ఆహారపు అలవాట్లు, జీవ వైవిధ్యం గురించి తెలుసుకున్నాం. మనుషులు, జంతువులు, మొక్కల జీవన విధానాల్లోని ప్రత్యేకతలను అర్థం చేసుకున్నాం. ఈ సందర్భంగా మాకు వచ్చిన సందేహాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నాం. వారు ఎంతో ఓపికగా మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. పుస్తకాల్లో చదివిన విజ్ఞానాన్ని ప్రత్యక్షంగా చూడటం వల్ల ఫిజిక్స్‌, బయాలజీ శాస్త్రాలపై మాకు మరింత ఆసక్తి పెరిగింది. ప్రతి వస్తువు వెనుక ఒక శాస్త్రీయ కారణం ఉంటుందని, ప్రకృతిలో జరిగే అనేక అద్భుతాలకు సైన్సే ఆధారమని తెలుసుకున్నాం. ఈ విధంగా నో బ్యాగ్‌ డే ఉత్సాహంగా, ఆటపాటలతో పాటు విజ్ఞానాన్ని అందించేలా విజయవంతంగా ముగిసింది. ఈ క్షేత్ర పర్యటనను మా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కళావతి, గైడ్‌ టీచర్లు సి. హేమలత, జి. చిన్నరెడ్డెప్ప తదితరులు పర్యవేక్షించారు. ఇలాంటి విజ్ఞాన యాత్రలు మరిన్ని నిర్వహిస్తే మాలో శాస్త్రీయ ఆలోచనలు, కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి మరింత పెరుగుతాయి.


ఇట్లు.. మీ విద్యార్థులు

ఎంపీఎల్‌ఎంపీఎస్‌, రామ్‌నగర్‌,

పుంగనూరు, అన్నమయ్య జిల్లా.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్