ముసలితనంలో అమ్మను వదిలేశారు.. తన కోట్ల ఆస్తిని ఆమె..?

Jan 28,2024 13:10 #decision, #mother, #sensational

చైనా : తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తమ పిల్లల కోసం ఆస్తులు కూడబెడతారు. కానీ ఆ పిల్లలు ఎదిగి తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తారు. ముఖ్యంగా ముసలితనంలో తమ తల్లిదండ్రుల మంచి-చెడు చూడాల్సిన పిల్లలు వారిని లక్ష్యపెట్టరు. ఈ తరహాలోనే చాలామంది ముసలివారు వృద్ధాశ్రమాల్లోనే ఉంటున్నారు. మరికొందరిని వారి పిల్లలే స్వయంగా రోడ్లపై దిక్కులేనివారిగా వదిలేసిన ఘటనలూ చూశాం…విన్నాం. అయితే చైనాలోని ఓ వృద్ధురాలు తన కోట్ల ఆస్తిని తన పెంపుడు కుక్కలకు, పిల్లులకు రాసిచ్చింది.. ఆ వృద్ధురాలికి ముగ్గురు పిల్లలున్నారు..!

పూర్తి వివరాల్లోకెళితే … చైనాలోని షాంఘైకి చెందిన ఓ వృద్ధురాలికి ముగ్గురు పిల్లలున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ఆ బామ్మ తన మొదటి వీలునామా రాసింది. అందులో ఆమె తన ఆస్తి మొత్తాన్ని తన ముగ్గురు పిల్లలకు పంచింది. అయితే ఆ ముగ్గురు పిల్లలు తల్లిని పట్టించుకోవడం మానేశారు. ఆమె అనారోగ్యంతో ఉన్నప్పుడు కనీసం చూడటానికి కూడా రాలేదు. కనీసం తమ తల్లి సంరక్షణ ఏర్పాట్లు కూడా చేయలేదు. ఆ బామ్మకు అన్ని వేళల్లో తోడుగా ఉన్నది.. ఆమె పెంపుడు కుక్కలు, పిల్లులే..! అందుకనే తాను తన సంపదనంతా తనతో ఎప్పుడూ ఉండే జంతువులకే ఇచ్చేయాలని నిర్ణయించుకుంది. ఆ బామ్మ తన పెంపుడు పిల్లులు, కుక్కల పేరుతో తన ఆస్తిని 2.8 మిలియన్‌ డాలర్లు అంటే మన దేశ కరెన్సీలో 23 కోట్లకు పైగా రూపాయలను రాసి ఇచ్చింది. ఇలా చేయడానికి కారణం కూడా చెప్పింది ఆ బామ్మ.. ఇవి ఎల్లప్పుడూ తనతో ఉంటాయని తెలిపింది. తన యావదాస్తిని పెంపుడు జంవుతుల పేరున బదిలీ చేసింది.

జంతువుల సంరక్షణను వెటర్నటి క్లినిక్‌కు అప్పగించింది…

వీలునామాను మార్చేటప్పుడు బామ్మ తగినన్ని జాగ్రత్తలు తీసుకుంది. ముందుగా లాయర్‌ ని సంప్రదించింది. అనంతరం వీలునామా రాస్తూ.. తాను మరణించిన తర్వాత, తన డబ్బు మొత్తాన్ని తన పెంపుడు జంతువులకు, ఆ జంతువుల పిల్లల సంరక్షణకు ఉపయోగించాలని రాసింది. చైనీస్‌ చట్టం ప్రకారం పెంపుడు జంతువులకు ఆస్తిని ఇవ్వడంపై ఎలాంటి ఆంక్షలు, నిషేధం లేదు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా మహిళ న్యాయవాదిని సంప్రదించి పక్కాగా ప్లాన్‌ తో తన ఆస్తిని కుక్కలకు బదలాయించింది. తన ఆస్తికి వారసత్వంగా వెటర్నరీ క్లినిక్‌ని ఎంచుకుంది. తనకు ఇష్టమైన తన పెంపుడు జంతువుల సంరక్షణను ఆ వెటర్నటీ క్లినిక్‌కి అప్పగించింది. ప్రస్తుతం ఈ వఅద్ధ మహిళ కథ చైనాలోని మిలియన్ల మంది ప్రజల హఅదయాలను కదిలించింది.

➡️