దూకే సాలీడు

May 25,2024 14:10 #Bengaluru, #Kodagu district, #spider

బెంగళూరు : సాధారణంగా సాలీడు పాకుతుంది. అయితే ఓ కొత్తజాతి సాలీడు మాత్రం దూకుతుంది. ఆశ్చర్యం కలిగించే ఈ సాలీడు ఎన్నో ఏళ్ల క్రితంకి చెందింది. తాజాగా ఇటువంటి జాతి సాలీడుని కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ప్రకతి శాస్త్రవేత్తల బందం కర్ణాటకలోని కొడగు జిల్లాలో సోమవారపేట తాలుకాలోని గర్వాలే అనే గ్రామంలో కనుగొన్నది. ఈ గ్రామంలో కనుగొన్నందున ప్రత్యేకించి ఈ సాలీడుకి లిగ్డస్‌ గర్వాలే అని శాస్త్రవేత్తలు పేరుపెట్టారు. ఇక ఈ సాలీడు గురించి ఈ బందంలోని దివ్యశ్రీ మాట్లాడుతూ.. ‘ఆగ్రో ఫారెస్ట్రీ చుట్టూ ఉన్న గర్వాలే గ్రామంలో లిగ్డస్‌ గర్వాలే కనిపించింది. ఈ ప్రాంతంలో కాఫీ తోటలు, మిరియాల తోటలు, వరి పొలాలలు ఉన్నాయి.’ అని ఆమె అన్నారు. కాగా, ‘ఈ సాలీడుని కనుగొన్న తర్వాత.. దాని శరీర నిర్మాణ పరీక్ష కోసం పరిశోధకుడు కాలేబ్‌కు నమూనాను పంపాము. ఈ జాతి సాలీడు 129 సంవత్సరాలలో గుర్తించడం రెండోసారి. ఈ జాతికి చెందిన లిగ్డస్‌ చెలిఫర్‌ని మొదటిసారి 1895లో మయన్మార్‌లో కనుగొన్నారు. ఇప్పుడు కనుగొన్న గర్వెల్‌ గ్రామంలో అల్లం ఆకు అడుగు భాగంలో గుర్తిం చాము. ఈ సాలీడు 0.2 అంగుళాలు. దీనికి ఎనిమిది కాళ్లు, ఎని మిది కళ్లు, సన్నని వెంట్రుకలు కప్పబడిన శరీరం కలిగి ఉంది. సాధారణంగా సాలీడు పాకుతుంది. కానీ ఇది మగ సాలీడు కావ డంతో దూకుతుంది’ అని ఈ బందంలోని అభిజిత్‌ అన్నారు.

➡️