బంగారు బాలల్లారా !
‘పులి’ అరుపులు విందామా
‘నెమలి’ నాట్యం చూద్దామా
‘ఏనుగు’పై ఎక్కుదామా’
మర్రి చెట్టు’లో దాక్కుందామా’
హాకీ’ ఆట ఆడుదామా’
మామిడి పండు’ తిందామా’
డాల్ఫిన్’తో ఆటలాడుదామా’
రూపాయి’ దాచుకుందామా’
వందేమాతరం’ విందామా’
తామర పువ్వు’ కోద్దామా’
జనగణమన’ పాడుదామా’
తిరంగా’ను ఎగిరేద్దామా
– బోనగిరి. పాండురంగ, తొర్రూరు.