మారుతి సుజుకి 10 లక్షల ఎర్టిగా అమ్మకాలు

Feb 9,2024 21:10 #Business

న్యూఢిల్లీ : ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ మారుతి సుజుకి భారత్‌లో ఇప్పటి వరకు తన మల్టీ పర్పస్‌ వెహికల్‌ (ఎంపివి) ఎర్టిగా మోడల్‌లో 10 లక్షల యూనిట్లను విక్రయించినట్లు ప్రకటించింది. ఈ మైలురాయి చేరడం సంతోషంగా ఉందని మారుతి సుజుకి ఇండియా సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ శశాంక్‌ శ్రీవాత్సవ తెలిపారు. పట్టణ, గ్రామీణ మార్కెట్లలోనూ మారుతి ఎర్టిగా దూసుకెళ్తుందన్నారు. ఎంపివి సెగ్మెంట్‌లో ఎర్టిగా 37.5 శాతం వాటా కలిగి ఉందన్నారు. ఎర్టిగాను 80కి పైగా దేశాలకు ఎగుమతి చేస్తున్నామన్నారు. 2012లో తొలుత ఎర్టిగాను ఆవిష్కరించగా.. 2018లో కొత్త వర్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రారంభ ధర రూ.8.69 లక్షలుగా ఉంది.

➡️