స్టార్టప్‌ సర్జ్‌ వినూత్న ‘ఇ-స్కూటర్‌ రిక్షా’

Jan 27,2024 21:10 #Business

కన్వర్టేబుల్‌ వాహనం ఆవిష్కరణ

న్యూఢిల్లీ : హీరో మోటో కార్ప్‌ అనుబంధ స్టార్టప్‌ సర్జ్‌32 వినూత్న వాహనాన్ని ఆవిష్కరించింది. విద్యుత్‌ వినియోగ స్కూటర్‌ను కేవలం మూడు నిమిషాల్లో ఆటో రిక్షాగా మార్చుకునే కొత్త వాహనాన్ని అభివృద్థి చేసింది. దీనిని హీరో వరల్డ్‌ ఈవెంట్‌లో ప్రదర్శించారు. స్వయం ఉపాధితో జీవించే వారి అవసరాల కోసం దీన్ని రూపొందించామని హీరో మోటో కార్ప్‌ వెల్లడించింది. మామూలు ఆటో రిక్షాల మాదిరిగానే ఈ త్రీవీలర్‌ ఆటో రిక్షాలో విండ్‌ స్క్రీన్‌, హెడ్‌ ల్యాంప్‌, టర్న్‌ ఇండికేటర్‌, విండ్‌ స్క్రీన్‌ వైఫర్లు ఉంటాయి. ఆటోకు డోర్లు లేకున్నా జిప్‌తో కూడిన సాఫ్ట్‌ డోర్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు. కాగా.. స్కూటర్‌, ఆటో రిక్షాకు సంబంధించి వేరువేరు బ్యాటరీలను అమర్చింది. ఆటో రిక్షాలో 10 కిలోవాట్ల ఇంజిన్‌, 11 కెడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ, స్కూటర్‌లో 3కిలోవాట్ల ఇంజిన్‌ ఉంటే 3.5 కెడబ్ల్యూహెచ్‌ బ్యాటరీతో ప్రవేశపెట్టింది. గంటకు గరిష్టంగా 50 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించే త్రీవీలర్‌ 500 కిలోల బరువు రవాణా చేయగలదు. టూ వీలర్‌ వెహికల్‌ మాత్రం గరిష్టంగా 60కిలోమీటర్ల వేగంగా ప్రయాణించగలదు. కాగా.. దీని ధరలను ఇంకా వెల్లడించలేదు.

➡️