భారీగా పెరిగిన తలసరి ఆదాయం !

Feb 6,2024 10:55 #capita income, #Huge increase
  • 2,42,479 కోట్లుగా పేర్కొన్న ప్రభుత్వం
  • చర్చనీయాంశంగా మారిన గణాంకాలు

ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : రాష్ట్రంలో తలసరి ఆదాయం భారీగా రికార్డయింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఏకంగా 2,42,479 కోట్లుగా ప్రభుత్వం తేల్చింది. దీనికి సంబంధించిన నివేదికను ప్రభుత్వం సిద్ధం చేసింది. గతేడాది కన్నా 2023-24 ఆర్థిక సంవత్సరంలో 10.28 శాతం వృద్ధి నెలకొన్నటు ఈ నివేదికలో పేర్కొన్నారు. ఇంతలా పెరగడానికి కారణాలను మాత్రం విశ్లేషించలేదు. అయితే ఇంత భారీగా తలసరి ఎలా పెరుగుతోందో అర్థం కావడం లేదని పలువురు అధికారులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి కేవలం 1,0,676 రూపాయల తలసరి ఆదాయం ఉండగా, 2019-20 నాటికి 1,60,341 రూపాయలకు చేరింది. 2021-22లో స్వల్పంగా మాత్రమే తలసరి ఆదాయం పెరిగినట్లు చూపించగా, ఆ తరువాత సంవత్సరాల నుంచి ఒక్కసారిగా భారీగా పెరుగుదల చూపించడం విశేషం. అక్కడి నుంచి వరుసగా 17.45 శాతం, 11.49 శాతం, 10.28 శాతంగా తలసరి పెరిగినట్లు అధికారులు పేర్కొనడం విశేషం. ప్రభుత్వం అందిస్తున్న పలు సంక్షేమ పథకాల ద్వారానే ప్రజల తలసరి ఆదాయం పెరిగిందని చెబుతున్న ప్రణాళిక శాఖ అధికారులు, అదే సమయంలో భారీగా పెరుగుతున్న ఖర్చులను విస్మరించి తలసరిని గణిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

➡️