అంగన్వాడీల పోరాటం చిరస్మరణీయం

ప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ అంగన్వాడీల పోరాటం చిరస్మరణీయమని కార్మిక వర్గ పోరాటాల చరిత్ర పేజీలలో దీనికి ఒక ముఖ్యమైన స్థానం ఏర్పడిందని అంగన్వాడీ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. సుబ్బరావమ్మ పేర్కొన్నారు. ఆదివారం అన్నమయ్య జిల్లాలోని శివ నర్సింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అంగన్వాడీల పోరాటం కార్మికోద్యమ చరిత్రలో ఓ మైలురాయిగా ఆయన అభివర్ణించారు. దేశంలో మోడీ, రాష్ట్రంలో జగన్మోహన్‌ రెడ్డి అనుసరిస్తున్న విధానాలు ప్రజల మనోభావాలకు భిన్నమైనవని ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పరిపాలన లేదని తెలిపారు. సమస్యల నుంచి పక్కదారి మళ్లించడానికి మతం పేరుతో, కులం పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలు సష్టించడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. మోడీ ప్రభుత్వ మతోన్మాద విధానాలను రాష్ట్రంలోని తెలుగుదేశం, వైసిపి, జనసేనలు బలపరచడం దురదష్టకరమని అన్నారు. సష్టిస్తున్న సంపదను ప్రజలకు కాకుండా కార్పొరేట్‌ శక్తులకు మళ్ళించడమే ఈ ప్రభుత్వాల అనైతిక చర్యగా ఆయన తెలిపారు. రాష్ట్రంలో 42 రోజులపాటు నిర్వహించిన అంగన్వాడీల సమ్మె నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిందని పోరాడే శక్తులకు బలాన్ని ఇచ్చిందని, పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అన్న నినాదాన్ని ఆచరణ యోగ్యం చేసిందని ప్రశంసించారు. అంగన్వాడీలు జీతాల కోసం పోరాడే సంఘం కాదని సమాజ మార్పుకు దోహదం చేసే సంఘంగా పరిణితి చెందాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన అన్నారు. రానున్న రోజులలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యల పరిష్కారానికి అంగన్వాడీ కార్యకర్తలు నాయకత్వం వహించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షులు పి. శ్రీనివాసులు సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సి.హెచ్‌. చంద్రశేఖర్‌, ఎ. రామాంజులు, అంగన్వాడీ యూనియన్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్‌.. శ్రీలక్ష్మి పి. రాజేశ్వరి, గంగ విజయ నాగమణి, సుమలత, అరుణ, పార్వ, రైతు సంఘం రామచంద్ర హమిలీతో పాటు అన్ని ప్రాజెక్టుల నాయకులు పాల్గొన్నారు.

➡️