అంగన్‌వాడీల రాస్తారోకో..

Jan 22,2024 21:20
ఫొటో : రాస్తారోకో నిర్వహిస్తున్న అంగన్‌వాడీ వర్కర్లు

ఫొటో : రాస్తారోకో నిర్వహిస్తున్న అంగన్‌వాడీ వర్కర్లు
అంగన్‌వాడీల రాస్తారోకో..
ప్రజాశక్తి-అనంతసాగరం : సిడిపిఒ నుండి ప్రిన్సిపల్‌ సెక్రటరీ వరకు సమ్మె నోటీస్‌ ఇచ్చి చట్టబద్ధంగా సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలపై దుర్మార్గంగా సమ్మె చేస్తున్న వారిని అరెస్టులు చేసి దీక్ష శిబిరాలను తొలగించడంపై నిరసనగా మండల కేంద్రంలో అంగన్‌వాడీలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి అన్వర్‌బాషా మాట్లాడుతూ 42 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా లక్ష మందికి పైగా అంగన్‌వాడీ కార్యకర్తలు రోడ్డుపై ఉన్నారని తెలియజేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నా ప్రభుత్వం చర్చల్లో ఇచ్చిన హామీలు కూడా ఇప్పటికే అమలుపరచలేదన్నారు. సమ్మె విచ్ఛిన్నం చేయడం కోసం సిడిపిఒలు, సూపర్‌వైజర్లు అంగన్‌వాడీలను బెదిరిస్తూ వారిని మానసికంగా ప్రశాంతత లేకుండా ఇబ్బందులు గురిచేయడం దుర్మార్గమన్నారు. సమ్మె కొనసాగిస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో కోటి సంతకాలతో ముఖ్యమంత్రికి ఇవ్వాలని విజయవాడకు వెళ్తుంటే వారిపై అక్రమంగా అరెస్టు చేసి దౌర్జన్యం చేసి దీక్ష శిబిరాన్ని తొలగించడం దారుణమన్నారు. జగన్‌ ప్రభుత్వం నిర్బంధానికి పూనుకుని అంగన్‌వాడీ, సిఐటియు నాయకులు కూడా అరెస్టు చేస్తోందన్నారు. దానిని రాష్ట్రంలోని ప్రజలందరూ ఖండించాలన్నారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు వేము పెంచలయ్య, ఐసిడిఎస్‌ అనంతసాగరం ప్రాజెక్టు అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు సునీత, నూర్జహాన్‌, అరుణ, పర్వీన్‌, అంగన్‌వాడీలు పాల్గొన్నారు.

➡️