అంగన్‌వాడీల వంటావార్పు

Dec 19,2023 22:03
ఫొటో : వంటావార్పు కార్యక్రమాన్ని చేపడుతున్న అంగన్‌వాడీలు

ఫొటో : వంటావార్పు కార్యక్రమాన్ని చేపడుతున్న అంగన్‌వాడీలు
అంగన్‌వాడీల వంటావార్పు
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన అంగన్‌వాడీల సమ్మె రోజురోజుకు ఆందోళన తీవ్ర రూపం దాలుస్తుంది. ఇప్పటికే ఆర్‌డిఒ కార్యాలయం, కలెక్టరేట్‌ కార్యాలయాలు ముట్టడించారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి చలనం లేకపోవడం శోచనీయమని, అంగన్‌వాడీ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకురాలు పి.రాధమ్మ అన్నారు. మంగళవారం ఆత్మకూరు ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీ కార్యకర్తలు వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. నిరవధిక సమ్మెను పెద్ద ఎత్తున అంగన్వాడీల పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి వెంటనే తమ సమస్యను పరిష్కరించాలని లేనిపక్షంలో ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తామని హెచ్చరించారు. సిఐటియు మండల గౌరవాధ్యక్షులు కొప్పోలు డేవిడ్‌ రాజు మాట్లాడుతూ అంగన్‌వాడీ కార్యకర్తలు వివిధ రూపాలలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారన్నారు. కనీస సమాచారం లేకుండా దౌర్జన్యంగా అంగన్‌వాడీ తాళాలు పగలగొట్టారని, వారిని అరెస్టు చేయాలన్నారు. ఈ ధమనకాండను ఆపకపోతే ప్రజాఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ సెక్టర్‌ లీడర్లు కె.రమణమ్మ, కామేశ్వరీ, జమీల, విజయలక్ష్మి, విజయమ్మ, మస్తానమ్మ, పద్మావతి, శ్రీదేవి, విజయమ్మ, రూతమ్మ, విజయభారతి, భాగ్యలక్ష్మి, సిపిఎం నాయకులు రమణయ్య, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఖాదర్‌ బాషా, తదితరులున్నారు.

➡️