అంగన్‌వాడీల వినూత్న నిరసన

Dec 22,2023 20:45
ఫొటో : పొర్లుదండాలు పెడుతున్న అంగన్‌వాడీ వర్కర్లు

ఫొటో : పొర్లుదండాలు పెడుతున్న అంగన్‌వాడీ వర్కర్లు
అంగన్‌వాడీల వినూత్న నిరసన
ప్రజాశక్తి-ఇందుకూరుపేట : స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద అంగన్‌వాడీ వర్కర్ల 11వ రోజు సమ్మెలో భాగంగా శుక్రవారం వినూత్న రీతిలో పోలేరమ్మ పూనినట్లు, పొర్లుదండాలు పెడుతూ నిరసన చేపట్టారు. ముందుగా మండల కార్యాలయం వద్ద రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. అనంతరం తమ డిమాండ్లను నెరవేర్చాలని జగన్‌ మోహన్‌ రెడ్డికి పొర్లు దండాలు పెట్టారు. అంగన్‌వాడీలు పోలేరమ్మ అమ్మవారు పూనినట్టు వినూత్న నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలుపుతూ జిల్లా సిఐటియు కార్యదర్శి గోగుల శీనయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్లను తీర్చలేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్తామన్నారు. అంగన్‌వాడీలు తలుచుకుంటే ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమన్నారు. కనీస వేతనం రూ.26 వేలు, గ్రాడ్యుటీ, రిటైర్మెంట్‌ బెనెఫిట్‌ వంటి వాటిని ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఆటో యూనియన్‌ అధ్యక్షులు మారుబోయిన రాజా, సిఐటియు మండల అధ్యక్షులు ఎస్‌కె ఛాన్‌బాషా, సిపిఎం మండల కార్యదర్శి మైపాటి కోటేశ్వరరావు, రైతు సంఘం నాయకులు తిక్కవర ప్రభాకర్‌ రెడ్డి, దయసాగర్‌, నక్క నరసింహ, కోనేటి వెంకయ్య, తదితరులు పాల్గొన్నారు.

➡️