అంగన్‌వాడీల వినూత్న నిరసన

Dec 26,2023 20:29
ఫొటో : పళ్లాలు వాయిస్తూ.. చెవిలో పువ్వులతో నిరసన వ్యక్తం చేస్తున్న అంగన్‌వాడీలు

ఫొటో : పళ్లాలు వాయిస్తూ.. చెవిలో పువ్వులతో నిరసన వ్యక్తం చేస్తున్న అంగన్‌వాడీలు
అంగన్‌వాడీల వినూత్న నిరసన
ప్రజాశక్తి-అనంతసాగరం : మండల కేంద్రంలోని ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ వద్ద అంగన్‌వాడీలు 15వ రోజు నిర్వహించిన సమ్మెలో చెవిలో పువ్వులు పెట్టుకుని, పళ్లాలు వాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వేతనాలు పెంచే విధంగా, తమ సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తీసుకోవడం లేదని, ఇప్పటికైనా అంగన్‌వాడీలతో చర్చలు జరిపి తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అనేక రాష్ట్రాల్లో అంగన్‌వాడీలకు కనీస వేతనాలు పెంచి గ్రాడ్యూటీని కూడా అమలు చేస్తున్నారన్నారు. జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్ర సందర్భంగా తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. తమకు కనీస వేతనం తమ డిమాండ్‌ను అంగీకరించే వరకు సమ్మె కొనసాగిస్తామని అందుకే పళ్లాలు వాయిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి మాట తప్పారు కాబట్టి చెవిలో పువ్వు పెట్టుకుని నిరసన తెలుపుతున్నామన్నారు. కార్యక్రమంలో సిఐటియు అనంతసాగరం మండల కార్యదర్శి అన్వర్‌బాషా, ఐసిడిఎస్‌ అనంతసాగరం ప్రాజెక్టు అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు లక్ష్మి, నూర్జహాన్‌, వసుంధర, సుబ్బమ్మ, భాగ్యమ్మ, వెంకట సుబ్బమ్మ, అంగన్‌వాడీలు పాల్గొన్నారు.

➡️