అంగన్‌వాడీల సమ్మెకు ఆశావర్కర్ల మద్దతు

Dec 26,2023 20:34
ఫొటో : మద్దతు తెలియజేస్తున్న ఆశావర్కర్లు

ఫొటో : మద్దతు తెలియజేస్తున్న ఆశావర్కర్లు
అంగన్‌వాడీల సమ్మెకు ఆశావర్కర్ల మద్దతు
ప్రజాశక్తి-కావలి రూరల్‌ : రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం జరుగుతున్న సమ్మె బుధవారం 15వ రోజుకు చేరింది. కావలి ఆర్‌డిఒ కార్యాలయం ఎదురుగా చేపట్టిన రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని ఆ సంఘం గౌరవ అధ్యక్షులు పి.పెంచలయ్య ప్రారంభించారు. అంగన్‌వాడీ టీచర్లు హెల్పర్లు ప్లేట్లను పట్టుకొని గరిటెలతో మోగిస్తూ నిరసన తెలిపారు. మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి కె.పెంచల నరసయ్య, జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి కృష్ణారెడ్డి పాల్గొని మద్దతును తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి వై.కృష్ణమోహన్‌, టి.మాల్యాద్రి, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఉదరు, అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు రఘురావమ్మ, సుభాషిని, కళావతి, బింధు, అంగనవాడీలు హెల్పర్లు పాల్గొన్నారు.

➡️